భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. GSLV M3-M3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించనుంది. మొత్తం 36 ఉపగ్రహాల (Satellites)ను నింగిలోకి పంపి.. వాటిని సురక్షితంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్... తిరుపతి జిల్లా... శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు ఇస్రో శాస్త్రవేత్తలు. మూడు దశల్లో రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లింది.
#WATCH | Andhra Pradesh: The Indian Space Research Organisation (ISRO) launches India’s largest LVM3 rocket carrying 36 satellites from Sriharikota (Source: ISRO) pic.twitter.com/jBC5bVvmTy
— ANI (@ANI) March 26, 2023
ఇదివరకు ఇస్రో విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపేది కాదు. కానీ కొన్నేళ్లుగా మన శాస్త్రవేత్తలు.. విదేశీ ఉపగ్రహాల్ని వాణిజ్యపరంగా నింగిలోకి పంపడం ప్రారంభించారు. మన సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటం, ఖర్చు కూడా తక్కువ కావడంతో.. విదేశాలు కూడా ఇస్రో ద్వారా తమ ఉపగ్రహాల్ని నింగిలోకి పంపించుకుంటున్నాయి. ప్రస్తుతం ఇస్రోకి అంతర్జాతీయ స్థాయిలో మంచి రేటింగ్ ఉంది. భారీగా ఆర్డర్స్ వస్తున్నాయి.
ఇప్పుడు నింగిలోకి పంపిన ఉపగ్రహాలన్నీ బ్రిటన్ కి చెందిన వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ సంస్థకు చెందినవి. ఇవి మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందిస్తాయి. ఈ వన్ వెబ్ కంపెనీ.. కావాలంటే.. తమ శాటిలైట్లను నాసా ద్వారా కూడా నింగిలోకి పంపుకోవచ్చు. కానీ నాసాతో పోల్చితే.. ఇస్రో ద్వారా ఖర్చులు దాదాపు 80 శాతం తగ్గుతాయి. అందుకే ఇస్రో సాయం తీసుకుంది. ప్రస్తుతం అంతరిక్షంలో వన్ వెబ్‌కి సంబంధించి 582 శాటిలైట్స్ ఉన్నాయి.
ఇస్రోలో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)... వన్ వెబ్‌తో 72 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపేందుకు డీల్ కుదుర్చుకుంది. త్వరలో ఇదే కంపెనీకి చెందిన మరో 36 శాటిలైట్లను కక్ష్యలోకి పంపనుంది. ఇందుకోసం ప్రయోగ ఫీజు రూ.1000 కోట్లకు పైనే అని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.