Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ విరిగిపోలేదు... ఇస్రో ప్రకటన

Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్ విరిగిపోలేదు... ఇస్రో ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

Chandrayaan-2 : చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో శుభవార్త చెప్పింది. సిగ్నల్స్ కట్ అయినప్పటికీ... విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గానే ఉందని తెలిపింది.

  • Share this:
ISRO Chandrayaan-2 : ఇది ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకోతగ్గ వార్త. చందమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచీ చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్... ముక్కలైపోలేదనీ, అది ఒకే సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) పడితే... పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ... చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి... అది పగిలిపోకుండా... ఉన్నది ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఇస్రో మరో శుభవార్త కూడా చెప్పింది. అంత ఎత్తు నుంచీ పడే ల్యాండర్... అటో ఇటో ఎటోకటు దొర్లుతూ వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ... విక్రమ్ ల్యాండర్ బుద్ధిగా ఎక్కడైతే పడింతో... అక్కడే అలాగే ఉందని వివరించారు ఇస్రోకి చెందిన ఓ అధికారి. పాటిజివ్ అంశాలు ఉండటం వల్ల ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు.

విక్రమ్ ల్యాండర్‌లోపల ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంది. అందువల్ల పైనుంచీ పడినప్పుడు ల్యాండర్ ముక్కలై ఉంటే... ఇక అది పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ఇస్రో చెబుతున్నదాని ప్రకారం ల్యాండర్ క్షేమంగా ఉంది కాబ్టట్టి... దాన్ని నుంచీ సిగ్నల్స్ అందుకునే అవకాశాలున్నాయి. ఒక్కసారి ఆ సిగ్నల్స్ అందితే ఇక దాన్ని కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. దాన్లోంచీ రోవర్‌ను బయటకు తెప్పించేందుకు కూడా వీలవుతుంది. అందువల్ల ఏం చేసైనా... ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు