మోదీకి విద్యార్థి ప్రశ్న... ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చిన ప్రధాని

PM Narendra Modi : విద్యార్థులు సాధారణంగా టీచర్, లాయర్, డాక్టర్, ఇంజినీర్ వంటివి కావాలని కలలు కంటారు. మరి ఆ విద్యార్థి కల ఏంటి? దానికి మోదీ ఎలా ప్రోత్సహించారు?

Krishna Kumar N | news18-telugu
Updated: September 7, 2019, 12:26 PM IST
మోదీకి విద్యార్థి ప్రశ్న... ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చిన ప్రధాని
విద్యార్థులతో ప్రధాని మోదీ (Image : Twitter - Balaji Duraisamy)
  • Share this:
Chandrayaan-2 : విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ శైలి ప్రత్యేకమైనది. నేను ప్రధానిని అన్న గర్వం లేకుండా ఆయన... ఎవరితోనైనా ఇట్టే కలుస్తారన్నది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకు తగ్గట్టే... చంద్రయాన్-2 ప్రయోగాన్ని లైవ్‌లో చూసేందుకు బెంగళూరులోని ఇస్రో హెడ్ ఆఫీస్‌కి వెళ్లిన ప్రధాని... అక్కడ దేశం నలుమూలల నుంచీ వచ్చిన 70 మంది స్కూల్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఐతే... ప్రయోగం జరిగిన తర్వాత... చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ అందకుండా పోయాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ చెప్పడంతో... మోదీతోపాటూ... విద్యా్ర్థులు కూడా అక్కడి నుంచీ బయటకొచ్చారు. అప్పుడు విద్యార్థులు ప్రధానితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అది గమనించిన మోదీ... ఏంటి విషయమని వాళ్లను అడిగారు. దాంతో ముందుకొచ్చిన ఓ స్టూడెంట్... మోదీని ఓ ఆశ్చర్యకరమైన ప్రశ్న అడగటంతో... అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. మోదీ ఏమంటారోనని ఒకింత టెన్షన్ పడ్డారు. కానీ మోదీ... ఎంతో ఆసక్తితో సమాధానం ఇచ్చారు.

మోదీ సార్... నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది. అందుకు నేనేం చెయ్యాలి? అని ప్రశ్నించాడు ఆ స్టూడెంట్. మోదీ... రాష్ట్రపతి ఎందుకు? ప్రధాన మంత్రి అవ్వు... అలా అవ్వాలని అనుకోవచ్చుగా అన్నారు. అంతే అక్కడున్న విద్యార్థులంతా... క్లాప్స్ కొట్టారు. ఐతే... చంద్రయాన్-2 విషయంలో అప్పటికే విద్యార్థులంతా ఓ రకమైన బాధలో ఉండటాన్ని గమనించిన మోదీ... వెంటనే విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే విషయాలు చెప్పారు. జీవితంలో ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలినా... గట్టిగా పోరాడాలే తప్ప వెనకడుగు వెయ్యకూడదని మోదీ అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మోదీ అనడంతో... విద్యార్థుల్లో ఒక్కసారిగా ధైర్యం, ఉత్తేజం కలిగాయి.
First published: September 7, 2019, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading