ఏపీలో మళ్లీ ఎన్నికలు తప్పవా... టీడీపీ ప్లాన్ అదేనా... వైసీపీ ఏం చేస్తుంది ?

AP Assembly Election 2019 : ఈసారి ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ఏమాత్రం సంతృప్తిగా లేదని తెలుస్తోంది. తిరిగి ఎన్నికలు జరిపిస్తారా అన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన ప్రశ్న.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 9:31 AM IST
ఏపీలో మళ్లీ ఎన్నికలు తప్పవా... టీడీపీ ప్లాన్ అదేనా... వైసీపీ ఏం చేస్తుంది ?
చంద్రబాబు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 9:31 AM IST
వైసీపీ నేతలు ఏదైతే జరగకూడదని భావిస్తున్నారో అదే జరగబోతోందన్న ప్రచారం జోరందుకుంటోంది. ఏపీలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, అందుకు టీడీపీ ప్లాన్ బీ సిద్ధం చేసింది అని అంటున్నారు కొందరు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మాటలు కూడా ఇందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 27 అర్థరాత్రి వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న ఆయన... అవసరమైతే, తప్పనిసరి అయితే రీపోలింగ్ జరిపిస్తామన్నారు. అంతేకాదు... పార్టీల మధ్య ఓట్ల తేడా తక్కువగా వున్నా రీపోలింగ్ తప్పదని ఆయన చెప్పారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వచ్చినా, ఈవీఎం డీకోడ్ కాకపోయినా, ఈవీఎంలు మొరాయించినా, పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నా రీపోలింగ్‌ జరిపించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు. ఈ మాటలు టీడీపీకి బలం చేకూర్చేలా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీ వ్యూహం అదేనా : ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సరే. ఒకవేళ రాకపోతే మాత్రం ఈవీఎంలు, వీవీప్యాట్లలో తేడా కొట్టిందనీ, అంతా గందరగోళం అయిపోయిందనీ మళ్లీ ఎన్నికలు జరపాల్సిందేనని టీడీపీ పట్టుపట్టే ఛాన్సుందని తెలుస్తోంది. 2014లో టీడీపీకి క్లియర్ మెజార్టీ రావడంతో... అప్పుడు ఆ పార్టీ ఈవీఎంలపై పోరాటానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మళ్లీ ఇప్పుడు టీడీపీ ఓడిపోతుందని తెలిసి, ఇలాంటి నాటకాలాడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

చంద్రబాబు మాత్రం ముందుగా ఈవీఎంలకు బదులు... వీవీప్యాట్ స్లిప్పులను కౌంటింగ్ చెయ్యాలని కోరుతున్నారు. అంతేకాదు... కౌంటింగ్‌లో ఏదైనా తేడా వస్తే... 5 వీవీప్యాట్లలో స్లిప్పులు కాకుండా మొత్తం అన్ని వీవీప్యాట్లలోని స్లిప్పులూ కౌంట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనతోపాటూ... 22 పార్టీల నేతలు కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించే అవకాశాలున్నాయి. అలా జరగదనీ, వీవీప్యాట్లు బాగానే పనిచేస్తాయని చెబుతుందని తెలిసింది. ఈ 22 పార్టీల్లో కీలకమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, డీఎంకే, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, జేడీఎస్, టీడీపీ ఉన్నాయి. అందువల్ల ఈ పోరు తీవ్రంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మళ్లీ ఎన్నికలంటే కష్టమే : వైసీపీ వైపు నుంచీ చూస్తే... ఆ పార్టీ మళ్లీ ఎన్నికలు జరిపించాలనే ఆలోచనలోనే లేదు. ఎందుకంటే కచ్చితంగా తామే గెలుస్తామనే కాన్ఫిడెన్సే. ఈ నమ్మకమే టీడీపీని మళ్లీ ఎన్నికలవైపు నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే... ఎన్నికల్లో ఏదో గోల్‌మాల్ జరిగిందనీ, దాన్ని ఎలాగైనా కనిపెట్టి... మొత్తం ఎన్నికల్ని రద్దు చేసైనా సరే... నిజానిజాల్ని బయటకు తేవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో గందరగోళం జరిగినట్లు టీడీపీ నిరూపిస్తే, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలను కనిపెడితే, అప్పుడు ఈసీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. అది రీపోలింగ్‌కి దారితీస్తుంది. అందుకే రేపు ఫలితాలు ఎలా ఉంటాయన్నదాన్ని బట్టీ, ఏపీ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రం ఉండే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి :

కర్ణాటకలో మళ్లీ ఎన్నికలొస్తాయా..? ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్
Loading...
ఢిల్లీ మాల్ స్పాలో సెక్స్ రాకెట్... ఒక్కో పనికి ఒక్కో రేటు

పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య

నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...