హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Go1 Effect: బాలయ్య.. చిరు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లపై జీవో 1 ఎఫెక్ట్.. ఏపీలో నిర్వహిస్తారా..? పేర్ని నాని క్లారిటీ

Go1 Effect: బాలయ్య.. చిరు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లపై జీవో 1 ఎఫెక్ట్.. ఏపీలో నిర్వహిస్తారా..? పేర్ని నాని క్లారిటీ

సంక్రాంతి బరిలో సై అంటున్న బాలయ్య వీరిసింహారెడ్డి Vs ఛిరంజీవి వీరసింహారెడ్డి  (Balakrishna Chiranjeevi)

సంక్రాంతి బరిలో సై అంటున్న బాలయ్య వీరిసింహారెడ్డి Vs ఛిరంజీవి వీరసింహారెడ్డి (Balakrishna Chiranjeevi)

Go1 Effect: సంక్రాంతి బరిలో ఢీ అండే ఢీ అనేందుకు బాలయ్య, చిరు సిద్ధమయ్యారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ల నిర్వహణకు భారీ కసర్తతు కూడా చేస్తున్నారు.. మరి ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లపై జీవో 1 ప్రభావం ఉంటుందా..? భారీ సభలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Go1 Effect:ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జీవో నెంబర్ వన్ దుమారం రేగుతోంది. విపక్షాలన్నీ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి. మరీ ఇంత నిరంకుశత్వమా అంటూ మండిపడుతున్నాయి. అయితే రోడ్ షోలు.. పబ్లిక్ మీటింగ్ లు.. భారీ సమావేశాలపై ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. మరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సంగతి ఏంటి..? ఎందుకంటే పండుగ సందడి పేరుతో బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి.. చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి.. కానీ అంతకముందే ఏపీ లో వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యమేనా..? జీవో నెంబర్ 1 ఎఫెక్ట్ వీటిపై పడుతుందా..? రోడ్ షోలు.. భారీ బహిరంగ సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ జీవోను కేవలం ప్రతిపక్షాల వరకే పరిమితం చేస్తున్నారని.. సీఎం జగన్ సమావేశాలకు ఇలాంటి జీవోలను పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లకు అదే రూల్ ఫాలో అవుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల నెల్లూరు , గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు నాయుడు పర్యటనల నేపథ్యంలో చోటుచేసుకున్న తొక్కిసలాటల దృష్ట్యా, ఎవైనా పార్టీలు, సంస్థలు, వ్యక్తులు భారీ బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌ షోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ జీవో1 అమలులోకి తెచ్చింది. దీంతో బుధవారం చంద్రబాబు కుప్పం పర్యటనలో రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఈ జీవో ప్రభావం జనవరి6వ తేదీన ఒంగోలులో జరగాల్సిన బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి, విశాఖపట్టణంలో నిర్వహించనున్న చిరంజివి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లపై పడనుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

ముఖ్యంగా బాలయ్య బాబు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు ఇబ్బందులు తప్పవనే ప్రచారం ఉంది. ఎందుకంటే ఆయన టీడీపీ ఎమ్మెల్యే.. చంద్రబాబుకు బావమర్ది.. దీనికి తోడు ఆయన వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడుతుంటారు.. ఈ నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తారని టాక్.. ఇప్పటికే ఒంగోలులో ముందుగా నిర్వహించిన స్థలంలో అనుమతి నిరాకరించారని, వేరే స్థలంలో పెట్టుకోవాలని పోలీసులు సూచించారన్న ప్రచారం జరుగుతోంది కూడా.. అయితే వాల్తేర్ వీరయ్య సినిమాకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు కలిగించే అవకాశం లేదని.. ఎందుకంటే మెగాస్టర్ చిరంజీవితో సాన్నిహిత్యాన్ని వైసీపీ కోరుకుంటోందని.. అందుకే ఆయన సభకు ఆటంకాలు ఉండకపోవచ్చనే ప్రచారం కూడా ఉంది..

అయితే జీవో1 నిబంధనలు మూవీ ఈవెంట్లకు వర్తిస్తాయా లేదా.. అని దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మూవీ ఈవెంట్లపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, స్థానిక పోలీసు అధికారులు ఈవెంట్ల నిర్వహణ అనుమతికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరణ ఇచ్చారు.. అయితే సినీ వర్గాలు మాత్రం ఈ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. ఏపీలో ఈవెంట్లు నిర్వహించి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, Balayya, Chiranjeevi, Tollywood

ఉత్తమ కథలు