TDP-BJP alliance: టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫైనల్ చేసేది వారే అంటూ క్లారిటీ

ప్రతీకాత్మకచిత్రం

Target 2024 Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయాలు (Politics) రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎవరు ఎవరితో జతకడితే బెటర్ అని లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు.. ఇందులో భాగంగా ప్రస్తుతం టీడీపీ-బీజేపీ (TDP-BJP) పొత్తుపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీల పొత్తులపై బీజేపీ ఎంపీ క్లారిటీ ఇచ్చారు.

 • Share this:
  Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ ముఖచిత్రం మారుతోందా..? ఎవరూ ఊహించని విధంగా కొత్త పొత్తులు పుట్టుకొస్తాయా..? లేక పాత మిత్రుల మధ్య మళ్లీ కొత్త పొత్తు పొడుస్తుందా..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో (AP Politics)హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ చర్చను రచ్చ రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యాలయాలపై దాడులు.. తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి.. కేవలం రాష్ట్రపతిని కలిసి రావడం.. అక్కడ ప్రధాని మోదీ (Prime Minster Modi), కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా (union minister amit shah)లు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో.. టీడీపీని బీజీపీ పెద్దలు లైట్ తీసుకున్నారని.. అసలు చంద్రబాబును కలవడం ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఇష్టం లేదని.. ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. అయితే ఇంతలోపే ఎవరూ ఊహించని విధంగా అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేయడంతో.. మళ్లీ ఏదో జరుగుతోందనే కథనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికలే టార్గెట్ గా టీడీపీ-బీజేపీలు పొత్తుకు రెడీ అయ్యాయా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

  టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు ఆ బాధ్యత తీసుకున్నారంటూ ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh)స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీతో పొత్తు ఉండదని బుధవారం బీజేపీ రాష్ట్ర కో-ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే ఎంపీ సీఎం రమేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం మళ్లీ చర్చకు తెర లేపింది.

  ఇదీ చదవండి: వార్నర్ మెరుపు ఇన్నింగ్స్.. వరుస విజయాలతో ఆసీస్ జోష్.. శ్రీలంకపై ఘన విజయం

  బీజేపీ-టీడీపీ పొత్తు ఉండేది, లేనేది.. కాదంటే ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది సునీల్ దియోదర్ లేదా జీవీఎల్ నరసింహారావు కానీ, తాను కానీ నిర్ణయించేది కాదు అన్నారు. ఇది జాతీయ పార్టీ కనుక జేపీ నడ్డా గారు, బీఎల్ సంతోష్ గారు, లేదా అమితా షా గారు నిర్ణయిస్తారన్నారు సీఎం రమేష్. ఎప్పుడైనా అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు.. ఆయన బీజేపీతో అలెయన్స్ పెట్టుకుంటాడని అనుకున్నామా అని ప్రశ్నించారు..? రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. అది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇది తమ పరిధిలోని అంశం కాదని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి: టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫైనల్ చేసేది వారే అంటూ క్లారిటీ

  మరోవైపు టీడీపీ మాజీ నేతలు, ప్రస్తుత బీజేపీ నేతల తీరుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సుజనాచౌదరికి పచ్చరంగు వదల్లేదని వ్యాఖ్యానించారు. అమిత్‌షా పక్కనే సుజనా చౌదరి ఉన్న ఫొటో పెట్టి ట్వీట్‌ చేశారు. సుజనా ఇంకా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, అమిత్‌షాతో చంద్రబాబు అపాయింట్‌మెంట్‌కు తెగప్రయత్నాలు చేశారని కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి.  ఇలా ఎవరికి వారు పొత్తులపై తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీ టీడీపీ కేడర్ కానీ.. అటు బీజేపీ కేడర్ కానీ అసలు పొత్తు ఉంటుందో లేదో తెలియక సతమతవుతోంది. మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కంటే.. జనసేనతో వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకోవడం మంచిందని స్థానిక నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: