Chiranjeevi-YS Jagan: మెగాస్టార్ స్థానంలో నాగార్జున.. మా ఎన్నికల తరువాత సీన్ ఇంతలా మారిపోయిందా ?

నాగార్జున, వైఎస్ జగన్, చిరంజీవి (ఫైల్ ఫోటో)

Chiranjeevi-Nagarjuna-YS Jagan:మా ఎన్నికలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో చిరంజీవికి గ్యాప్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో జరిగిన సమావేశానికి చిరంజీవి దూరంగా ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది.

  • Share this:
    పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని పరిణామాల తరువాత అవి మారుతూ ఉంటాయి. టాలీవుడ్‌లో మా అసోసియేషన్ ఎన్నికల తరువాత పరిస్థితులు మారాయనేది చాలామంది చెబుతున్న విషయం. అయితే ఏం మారిందన్నది మాత్రం ఎవరూ బయటకు చెప్పడం లేదు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను సినీనటుడు నాగార్జున (Akkineni Nagarjuna) కలుసుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. పైకి తాను సీఎం జగన్‌తో(ap cm ys jagan mohan reddy) ఏ విషయాలు మాట్లాడాననే విషయాన్ని నాగార్జున నేరుగా చెప్పకపోయినప్పటీ.. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిన రోజే నాగార్జున సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానం పట్ల టాలీవుడ్ మూవీ మేకర్లు సానుకూలంగానే ఉన్నా.. టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వాలని.. అలా జరగకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలో ఉన్నారు.

    అయితే ఈ విషయాన్ని నాగార్జున సీఎం జగన్‌తో చర్చించారా ? లేదా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సీఎం జగన్‌తో నాగార్జున భేటీ తరువాత టాలీవుడ్‌లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. మా ఎన్నికల రగడ తరువాత ఇండస్ట్రీ పెద్ద ఎవరనే చర్చ కూడా సాగుతోంది. దాసరి తరువాత చిరంజీవే(Megastar Chiranjeevi) ఇండస్ట్రీ పెద్ద అనే టాక్ వినిపించింది. అయితే మా ఎన్నికల్లో ఆయన మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ ఓడిపోవడంతో.. మరోసారి దీనిపై చర్చ మొదలైంది. సినీ ఇండస్ట్రీ పెద్దగా.. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి చర్చించేందుకు ఆయన పలుసార్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్, కేసీఆర్‌లతో సమావేశమయ్యారు.

    కానీ మా ఎన్నికలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో చిరంజీవికి గ్యాప్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో జరిగిన సమావేశానికి చిరంజీవి దూరంగా ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ పరిస్థితులన్నీ ఎప్పటిలాగా ఉండి ఉంటే.. నేడు నాగార్జునతో పాటు చిరంజీవి కూడా సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో ఉండి ఉండేవారనే ప్రచారం కూడా టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఎవరితో చర్చించి.. భవిష్యత్తులో ఎవరితో చర్చిస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే మా ఎన్నికల పరిణామాల నేపథ్యంలో గతంలో మాదిరిగా చిరంజీవి ఇండస్ట్రీ సమస్యల విషయంలో ప్రభుత్వ పెద్దలను.. అందులోనూ ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశాలు లేవనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: