Home /News /andhra-pradesh /

IS AP CM YS JAGAN MOHAN REDDY TALKS WITH CHIRANJEEVI SHOCKS MOHAN BABU AND MANCHU FAMILY AK

AP News: సీఎం జగన్ మరోసారి ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారా ?.. అందుకే సైలెంట్ అయిపోయారా ?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

మా అధ్యక్ష ఎన్నికల్లో తన కుమారుడు విష్ణును గెలిపించుకోవడం ద్వారా చిరంజీవిపై మోహన్ బాబు పైచేయి సాధించారని.. ఇండస్ట్రీలో వారి ఆధిపత్యంపై దెబ్బకొట్టారనే ప్రచారం సాగింది.

    రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయాల్లో అవసరాలు, పరిస్థితులు బట్టి ప్రాధాన్యతలు మారుతుంటాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఓ పరిణామం.. ఓ సీనియర్ నటుడికి ఊహించని విధంగా షాక్ ఇచ్చిందనే చర్చ సినీ, రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఏపీలో సినిమా టికెట్ల రగడకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడయిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించింది. ఏపీ సీఎం జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు రావడంతో.. ఆయన తాడేపల్లి వచ్చి వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ తరువాత ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి దాదాపుగా ఓ పరిష్కారం లభించినట్టే అనే చర్చ సినీవర్గాల్లో మొదలైంది. ఏపీ సీఎం జగన్‌తో భేటీ తరువాత చిరంజీవి కూడా త్వరలోనే ప్రభుత్వం నుంచి ఈ అంశంపై సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పడం సినీవర్గాలకు ఊరట కలిగించింది.

    Chiranjeevi versus mohanbabu, Tollywood latest news, k raghavendra comments on chiranjeevi mohanbabu controversy, telugu latest news, చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు, టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్, చిరంజీవి మోహన్ బాబు కాంట్రవర్సీపై రాఘవేంద్రరావు రియాక్షన్, తెలుగు లేటెస్ట్ న్యూస్
    మోహన్ బాబు, చిరంజీవి (ఫైల్ ఫోటో)


    సినిమా టికెట్ల వివాదం వ్యవహారం ఎలా ఉన్నా.. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీతో మరోసారి మోహన్ బాబు, మంచు ఫ్యామిలీ అంశంపై చర్చ జరుగుతోంది. మా ఎన్నికల సందర్భంగా చిరంజీవి మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ను ఓడించేందుకు మంచు ఫ్యామిలీ ఎంతగానో శ్రమించింది. ఈ విషయంలో మంచు ఫ్యామిలీకి ఏపీ సర్కార్ సపోర్ట్ కూడా లభించిందనే వార్తలు కూడా వచ్చాయి. మా ఎన్నికలు, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దను కానని ప్రకటించడం.. ఇందుకు మోహన్ బాబు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి.

    ఇలాంటి సమయంలో ఏపీ సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపురావడంతో... సీఎం జగన్ మరోసారి మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వైసీపీకి ఎన్నికల ముందు నుంచి మంచు ఫ్యామిలీ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. మోహన్ బాబు ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబుకు ఆయన స్థాయికి తగ్గ పదవి వస్తుందని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. మోహన్ బాబు వైసీపీ నుంచి ఏ పదవీ ఆశించలేదా ? లేక వైఎస్ జగన్ మోహన్ బాబును పక్కనపెడుతూ వచ్చారా ? అన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం.

    MLA Roja: మాట తప్పని మడమ తిప్పని రోజా.. ఆ విషయంలో జగన్ బాటలోనే..!

    KCR-YS Jagan: కేసీఆర్ ప్లాన్‌కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉంటుందా ?.. దూరంగానే ఉంటారా ?

    అయితే మా అధ్యక్ష ఎన్నికల్లో తన కుమారుడు విష్ణును గెలిపించుకోవడం ద్వారా చిరంజీవిపై మోహన్ బాబు పైచేయి సాధించారని.. ఇండస్ట్రీలో వారి ఆధిపత్యంపై దెబ్బకొట్టారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశంపై చిరంజీవికి మోహన్ బాబు పోటీ అయ్యారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్ చిరంజీవిని పిలిచి చర్చలు జరపడంతో... ఆయన మరోసారి మోహన్ బాబు, మంచు ఫ్యామిలీకి ఊహించని షాక్ ఇచ్చారనే వార్తలు మొదలయ్యాయి. వైఎస్ జగన్‌తో చిరంజీవి సమావేశంపై మోహన్ బాబు రియాక్ట్ కాకపోవడం వెనుక అసలు కారణంగా కూడా ఇదే కావొచ్చనే టాక్ సినీ, రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chiranjeevi, Mohan Babu

    తదుపరి వార్తలు