IRCTC Sabarimala Tour: ఐఆర్‌సీటీసీ శబరిమల టూర్... ప్యాకేజీ రూ.2,990 మాత్రమే

IRCTC Sabarimala Tour | ఆసక్తిగల వాళ్లు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. ప్యాకేజీలో రైలు టికెట్లు, ఏసీ బస్సులో ప్రయాణం కవర్ అవుతాయి.

news18-telugu
Updated: December 10, 2019, 1:14 PM IST
IRCTC Sabarimala Tour: ఐఆర్‌సీటీసీ శబరిమల టూర్... ప్యాకేజీ రూ.2,990 మాత్రమే
IRCTC Sabarimala Tour: ఐఆర్‌సీటీసీ శబరిమల టూర్... ప్యాకేజీ రూ.2,990 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
శబరిమల యాత్రకు వెళ్లాలనుకునే అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శబరిమల యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో శబరిమల వెళ్లాలనుకునే భక్తులు చెన్నై చేరుకొని అక్కడ్నుంచి శబరిమల వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై సమీపంలో ఉండే తెలుగు భక్తులకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్యాకేజీ ధర రూ.రూ.2,990 మాత్రమే. ప్రతీ గురువారం, శుక్రవారం ఈ టూర్ ఉంటుంది. చెన్నై నుంచి కొట్టాయం మీదుగా శబరిమల తీసుకెళ్లారు. 3 రోజులు, 2 రాత్రుల ప్యాకేజీ ఇది. ఆసక్తిగల వాళ్లు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. ప్యాకేజీలో రైలు టికెట్లు, ఏసీ బస్సులో ప్రయాణం కవర్ అవుతాయి.

IRCTC Sabarimala Tour: ప్యాకేజీ వివరాలివే...



ప్రతీ గురువారం, శుక్రవారం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో శబరిమల టూర్ ప్రారంభం అవుతుంది. కాబట్టి భక్తులు అప్పట్లోగా చెన్నై చేరుకోవాలి. మొదటి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో 12695 నెంబర్ గల రైలు ఎక్కాలి. రెండో రోజు తెల్లవారుజామున 4.17 గంటలకు కొట్టాయం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి పంబకు బయల్దేరాలి. నీలక్కల్ దగ్గర భక్తుల్ని వదిలిపెడతారు. నీలక్కల్ నుంచి పంబ వరకు ప్రభుత్వ బస్సులో సొంత ఖర్చులతో వెళ్లాలి. సాయంత్రం 4.00 గంటలకు పంబకు చేరుకుంటారు. అక్కడ్నుంచి శబరిమల వెళ్లాలి. శబరిమలలో సొంత ఖర్చులతో బస ఏర్పాట్లు చేసుకోవాలి. మూడో రోజు తెల్లవారుజామున 3.00 గంటలకు అభిషేకంలో పాల్గొనాలి. 07:00 గంటలకు పంబకు బయల్దేరాలి. పంబ నుంచి నీలక్కల్‌కు సొంత ఖర్చులతోనే రావాల్సి ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు నీలక్కల్ చేరుకుంటారు. సమయం ఉంటే స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించొచ్చు. సాయంత్రం 6:30 గంటలకు కొట్టాయం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. కొట్టాయం రైల్వే స్టేషన్‌లో రాత్రి 08.30 గంటలకు 12696 నెంబర్ గల రైలు ఎక్కాలి. నాలుగో రోజు ఉదయం 10.00 గంటలకు చెన్నై చేరుకోవడంతో శబరిమల యాత్ర ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Realme X2 Pro: తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్‌2 ప్రో... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Sabarimala Bike Rent: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్... బైక్ అద్దెకు తీసుకోవచ్చుSabarimala: శబరిమల వెళ్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆర్జిత సేవలకు ఎంత చెల్లించాలో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: December 10, 2019, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading