టీటీడీ గుడ్ న్యూస్.. ఎస్వీబీసీ సీఈఓ పోస్టుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

ప్రతీకాత్మక చిత్రం

తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో మూడేళ్ల కాల‌ప‌రిమితికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టును భ‌ర్తీ చేసేందుకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అయితే ఈ పోస్టుకు హిందువులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు.

  • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానల్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పోస్టును భర్తీ చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో మూడేళ్ల కాల‌ప‌రిమితికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టును భ‌ర్తీ చేసేందుకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అయితే ఈ పోస్టుకు హిందువులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు. సంబంధిత పోస్టుకు ద‌ర‌ఖాస్తులు చేసేందుకు చివ‌రి తేదీ మే 29గా నిర్ణ‌యించారు. దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2020, ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్ల నుంచి 55 ఏళ్ల‌లోపు వ‌యోప‌రిమితి ఉండాలి. విద్యార్హ‌త‌లు, అనుభ‌వం త‌దిత‌ర వివ‌రాలతో పాటు ద‌ర‌ఖాస్తు ఫారం కోసం www.svbcttd.com వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను mdsvbc@gmail.comకు మెయిల్ ద్వారా గానీ లేదా "మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌, అలిపిరి, తిరుప‌తి - 517507" అనే చిరునామాకు పోస్టు ద్వారా గానీ పంప‌వ‌చ్చు.
    Published by:Narsimha Badhini
    First published: