Home /News /andhra-pradesh /

INTERRUPTION IN OXYGEN SUPPLY LEADS TO DEATH OF 10 COVID 19 PATIENTS IN TIRUPATI RUYA HOSPITAL AK TPT

Tirupati: తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం.. ఆక్సిజన్ అందక 10 మంది మృతి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tirupati: ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. ఈ కారణంగానే పలువురు కరోనా పేషెంట్లు చనిపోయారని తెలుస్తోంది.

    ఓ వైపు కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను మింగేస్తుంటే.. మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక చనిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకమంది కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా.. సకాలంలో ఆక్సిజన్ అందక అనేక మంది తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలోనూ ఇదే రకమైన కారణంతో పలువురు చనిపోయారు. కరోనా ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో.. పలువురు కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఆస్పత్రిలోని ఎం.ఎం.1,2,3 వార్డులో ఆరుగురు మృతి చెందారు. ఐసీయూలో ముగ్గురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు మృతి చెందారు.

    మొత్తం 10 మంది చనిపోయారని వార్తలు వస్తున్నా.. ఎంతమంది చనిపోయారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే మరికొందరు కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటనే దానిపై మాత్రం పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఆక్సిజన్‌ సరఫరా ప్రారంభించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి తమ వారి ప్రాణాలు పోయినట్టు మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు