ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థలకు షాక్....వెబ్‌సైట్స్ హ్యాక్

డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. డిస్కం వెబ్‌‌సైట్స్ హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు TSSPDCL ఫిర్యాదు చేసింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: May 2, 2019, 11:05 AM IST
ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థలకు షాక్....వెబ్‌సైట్స్ హ్యాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాలపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ఏపీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్స్‌పై రాన్సమ్‌వేర్ వైరస్‌తో దాడిచేసి రెచ్చిపోయారు. TSSPDCL, TSNPDCL, APSPDCL, APEPDCL వెబ్ సైట్లను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. కీలక డేటాను తస్కరించి డిలీట్ చేసిన అంతర్జాతీయ కేటుగాళ్లు...రూ.35  కోట్లు చెల్లిస్తేనే డేటా ఇస్తామంటూ కండిషన్ పెట్టారు. ఐతే డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. డిస్కం వెబ్‌‌సైట్స్ హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు TSSPDCL ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు