Home /News /andhra-pradesh /

INTERESTING DISCUSSION ON RRR MOVIE BUDGET CAN FULL FILL THESE WELFARE SCHEME IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

RRR vs AP Welfare Schemes: ఆర్ఆర్ఆర్ బడ్జెట్ తో ఏపీలో ఈ పథకాలు అమలు చేయవచ్చు.. అవేంటంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా (RRR Movie) కనిపిస్తోంది. ఐదేళ్లపాటు ఎదురుచూసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు పండగ చేసుకున్నాడు. ఐతే ఆర్ఆర్ఆర్ బడ్జెట్ (RRR Movie Budget) తో ఏపీలో కొన్నిపథకాలు అమలు చేయవచ్చంటూ సరదాగా లెక్కలు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా (RRR Movie) కనిపిస్తోంది. ఐదేళ్లపాటు ఎదురుచూసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు పండగ చేసుకున్నాడు. అలాగే రిలీజ్ అయిన తొలిరోజే రికార్డులు సృష్టించింది. అందుకే ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie Budget) విశేషాల గురించే చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. రెమ్యునరేషన్లు కాకుండానే ఈ సినిమాకు రూ.336 కోట్లు ఖర్చైనట్లు నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి లెక్కలు చెప్పారు. ఇక రెమ్యునరేషన్లతో కలిపి మొత్తం రూ.500 కోట్లు దాటిపోయి ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆర్ఆర్ఆర్ బడ్జెట్ ను ఏపీ బడ్జెట్ తో పోల్చుతున్నారు. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ తో కొన్ని పథకాలు అమలు చేయవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడి, రైతు భరోసా (YSR Rythu Bharosa), వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha, , వైఎస్ఆర్ కాపునేస్తం (YSR Kapunestham), ఈబీసీ నేస్తం (EBC Nestham), మత్స్యకారభరోసా వంటి పథకాలకు భారీగా ఖర్చు చేస్తోంది. ఆర్ఆర్ఆర్ బడ్జేట్ రూ.500 కోట్లకు అటూఇటుగా ఉండే అవకాశాలుంటడంతో ఈ బడ్జెట్ అమలయ్యే పథకాలపై చిన్న లుక్కేయొచ్చు.

    ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్స్ చించిపడేసిన ఫ్యాన్స్.. కారణం ఇదే.. రచ్చ మాములుగా లేదుగా..


    అగ్రవర్ణాల వారి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా “వైఎస్సార్ ఈబీసీ పథకం” తీసుకొచ్చారు సీఎం జగన్. దీనిని ఇటీవలే ప్రారంభించారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న 3.92 లక్షల మంది లబ్దిదారులకు రూ. 589 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. ఈ పథకం ఆర్ఆర్ఆర్ బడ్జెట్ కు దగ్గరగానే ఉంది.

    ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ టికెట్స్ కావాలా..? ఐతే ఈ కోడ్ ఎంటర్ చేయండి.. వైసీపీ నేతపై ట్రోలింగ్..


    ఇక మత్స్యకార భరోసా పథకం కింద రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మందికి ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున రూ.119.87 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ దాదాపు నాలుగేళ్ల పాటు ఈ పథాకాన్ని అమలు చేసే అవకాశమంది.

    ఇది చదవండి: ఆంధ్రా మామిడికి ఉక్రెయిన్ కష్టాలు.. రైతులకు నష్టాలు తప్పవా..?


    అలాగే నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. అంటే RRR తో రెండు నుంచి మూడుసార్లు పథకాన్ని అమలు చేసేందుకు వినియోగించకోచ్చు. కాపునేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.30,లక్షల మందికి మహిళలకు రూ.15వేలు చొప్పున రూ.490 – రూ.500 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించవచ్చు. ఓ ఏడాదిలో పలు పథకాలను అమలు చేయొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap welfare schemes, Rrr movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు