ఓటుకే కాదు ఉల్లి కొన్నా సిరా గుర్తు.. నెల్లూరులో విచిత్రం..

తక్కువ ధరకే ఉల్లి దొరుకుతుండడంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న రాయితీ ఉల్లి కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. షాపు తెరిచేదే ఆలస్యం.. జనాలు ఎగబడుతున్నారు. కిలోమీటర్ మేర క్యూలైన్‌లో నిలబడుతున్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 8:17 PM IST
ఓటుకే కాదు ఉల్లి కొన్నా సిరా గుర్తు.. నెల్లూరులో విచిత్రం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయలను కోస్తే కాదు.. ఇప్పుడు వాటి ధరలను చూస్తేనే గృహిణులకు కన్నీళ్లొస్తున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ.150 మేర పలుకుతున్నాయి. ఇక నాణ్యమైన, మంచి సైజులో ఉండే ఉల్లిగడ్డ కావాలంటే కిలోకు రూ.200 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉల్లి లేకుండానే ఆహార పదార్థాలను వడ్డిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లిగడ్డను కొనేవాడిని శ్రీమంతుడిగా చూసే రోజులొచ్చాయి. ఐతే ప్రభుత్వం రాయితీపై ఉల్లిని సరఫరా చేస్తూ సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది. కిలో ఉల్లిని కేవలం రూ.25కే అందిస్తోంది.

తక్కువ ధరకే ఉల్లి దొరుకుతుండడంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న రాయితీ ఉల్లి కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. షాపు తెరిచేదే ఆలస్యం.. జనాలు ఎగబడుతున్నారు. కిలోమీటర్ మేర క్యూలైన్‌లో నిలబడుతున్నారు. ఆ లైన్లలో వృద్ధులు, గర్భిణి స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విజయనగరం సహా పలు ప్రాంతాల్లో తొక్కిసలాటలు కూడా జరిగాయి. అంతేకాదు ఉల్లిని కొన్న వాళ్లు మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని రాయితీ ఉల్లి కేంద్రం నిర్వాహకులు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి తీసుకున్న వారు మళ్లీ రాకుండా చేతికి సిరా గుర్తు వేసి పంపిస్తున్నారు. అంటే క్యూలైన్లలో నిలబడి ఓటు వేసినట్లుగానే.. క్యూలైన్లలో నిలబడి ఉల్లిని కొంటున్నారు. వారందరికీ సిరా గుర్తు వేస్తున్నారు నిర్వాహకులు.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>