Uday Express: విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రత్యేకతలివే

UDAY Express | విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

news18-telugu
Updated: August 19, 2019, 7:38 PM IST
Uday Express: విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రత్యేకతలివే
Uday Express: విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రత్యేకతలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 19, 2019, 7:38 PM IST
ప్రయాణికులకు, పర్యాటకులకు శుభవార్త. ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ యాత్రి-UDAY ఎక్స్‌ప్రెస్ పేరుతో భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న ఉదయ్ ఎక్స్‌ప్రెస్ విశాఖటప్నం-విజయవాడ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలు మొదటిసారిగా కొయంబతూర్ నుంచి బెంగళూరుకు గతేడాది జూన్‌లో ప్రారంభమైంది. త్వరలో విశాఖపట్నం-విజయవాడ మధ్య చక్కర్లు కొట్టనుంది. ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఒక కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీతో ఉండే ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకతలు ఎన్నో. విశాఖపట్నం, విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701) దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి రైల్వేస్టేషన్లల్లో ఆగుతుంది. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది.


Uday Express: ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఇవే...




ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 9 ఏసీ కోచ్‌లు, 2 పవర్ కార్స్ ఉంటాయి.
Loading...
ప్రతీ కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీ ఉంటుంది.
అప్పర్ డెక్‌లో 50, లోయర్‌డెక్‌లో 48, చివర్లో 22 మంది కూర్చోవచ్చు.
3 కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అందులో ప్రతీ కోచ్‌లో 104 ప్రయాణికులు కూర్చోవచ్చు.
5 కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉండదు.
ఈ రైలు ఉదయం 05:45 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి విజయవాడకు 11:15 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5:30 గంటలకు విజయవాడలో బయల్దేరి రాత్రి 10:55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం నుంచి విజయవాడకు 5 గంటల 30 నిమిషాల్లో, విజయవాడ నుంచి విశాఖపట్నానికి 5 గంటల 25 నిమిషాల్లో రైలు చేరుకుంటుంది.
సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం రోజుల్లోనే ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
మెత్తని సీట్లు, కళ్లుచెదిరే ఇంటీరియర్, డిస్‌ప్లే స్కీన్స్, వైఫై సౌకర్యం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railways: ట్రైన్ టికెట్‌పై 100% వరకు కన్సెషన్... ఎవరెవరికో తెలుసా?

World Photography Day: మీ సెల్ఫీలు, ఫోటోలు అద్భుతంగా రావాలా? ఈ స్మార్ట్‌ఫోన్లు ట్రై చేయొచ్చు

Realme Days Sale: రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...