హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Train Timings: ఆ రైలు టైమింగ్స్ మారుతున్నాయి... కొత్త వేళలివే

Train Timings: ఆ రైలు టైమింగ్స్ మారుతున్నాయి... కొత్త వేళలివే

Train Timings: ఆ రైలు టైమింగ్స్ మారుతున్నాయి... కొత్త వేళలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Train Timings: ఆ రైలు టైమింగ్స్ మారుతున్నాయి... కొత్త వేళలివే (ప్రతీకాత్మక చిత్రం)

Sabari Express Timings | ప్రయాణికులు రైలు టికెట్ బుక్ చేసే ముందు ఈ రైలు వేళలు ఓసారి సరిచూసుకోవాలి.

భారతీయ రైల్వే హైదరాబాద్ తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల వేళల్ని మారుస్తోంది. జనవరి 27 నుంచి కొత్త టైమింగ్స్ అమలులోకి వస్తాయి. శబరి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. టర్మినల్ పాయింట్‌ను హైదరాబాద్ నుంచి కాకుండా సికింద్రాబాద్‌కు మార్చారు. అంటే హైదరాబాద్-తిరువనంతపురం పేరుతో నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ జనవరి 27 నుంచి సికింద్రాబాద్-తిరువనంతపురం రైలుగా పేరు మారుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు రైలు బయల్దేరుతుంది. 12.37 గంటలకు చర్లపల్లికి, మధ్యాహనం 2 గంటలకు నల్గొండకు, 2.25 గంటలకు మిర్యాలగూడకు, 3.10 గంటలకు నడికుడికి, 3.30 గంటలకు పిడుగురాళ్లకు, 4.04 గంటలకు సత్తెనపల్లికి, సాయంత్రం 5 గంటలకు గుంటూరు చేరుకొని తిరువనంతపురం వెళ్తుంది. ఇక ఉదయం 7 గంటలకు తిరువనంతపురంలో బయల్దేరే శబరి ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 6.28 గంటలకు తెనాలికి, 6.55 గంటలకు గుంటూరు, 7.40 గంటలకు సత్తెనపల్లి, 8.04 గంటలకు పిడుగురాళ్ల, 8.25 గంటలకు నడికుడి, 8.55 గంటలకు మిర్యాలగూడ, 9.25 గంటలకు నల్గొండ, 11.24 గంటలకు చర్లపల్లి, మధ్యాహ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ప్రయాణికులు రైలు టికెట్ బుక్ చేసే ముందు ఈ రైలు వేళలు ఓసారి సరిచూసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Railway Helpline: రైలు ప్రయాణంలో ఇబ్బందులా? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి

Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు

ICICI Bank: ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, Indian Railway, Indian Railways, Railways, South Central Railways, Telangana, Telangana News, Telangana updates, Train

ఉత్తమ కథలు