Home /News /andhra-pradesh /

INDIAN RAILWAYS RENOVATED GUNTAKAL RAILWAY STATION WITH MODERN FACILITIES AND INTERNATIONAL STANDARDS SEE VIDEO SS

Indian Railways: ఎయిర్ పోర్టా? రైల్వే స్టేషనా? గుంతకల్లు స్టేషన్ ఎలా మారిపోయిందో చూడండి (Video)

Indian Railways: ఎయిర్ పోర్టా? రైల్వే స్టేషనా? గుంతకల్లు స్టేషన్ ఎలా మారిపోయిందో చూడండి
(image: Guntakal Railway Station / Indian Railways)

Indian Railways: ఎయిర్ పోర్టా? రైల్వే స్టేషనా? గుంతకల్లు స్టేషన్ ఎలా మారిపోయిందో చూడండి (image: Guntakal Railway Station / Indian Railways)

Indian Railways | భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించింది. ఆ వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. గుంతకల్లు రైల్వే స్టేషన్ ఎలా మారిపోయిందో వీడియో చూడండి.

    భారతీయ రైల్వే దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లను కూడా పునరుద్ధరిస్తోంది. అధునాతన హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఎయిర్‌పోర్టును తలపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే గజిబిజిగా కనిపించే దృశ్యాలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది భారతీయ రైల్వే. ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు రైల్వే స్టేషన్‌ను సుందరంగా మార్చింది. ఎయిర్‌పోర్టును తలపించేలా ఏర్పాట్లు చేసింది. కలర్‌ఫుల్ లైటింగ్, అద్దాలను తలపించేలా ఫ్లోరింగ్, ప్రయాణికులు కూర్చోవడానికి సీటింగ్... ఇలా ప్రతీ దాన్ని మార్చేసింది భారతీయ రైల్వే. ఎయిర్‌పోర్టును తలపిస్తున్న గుంతకల్లు రైల్వే స్టేషన్ వీడియోను ఇండియన్ రైల్వేస్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.

    Indian Railways: ఇంత పొడవైన గూడ్స్ రైలు మీ జీవితంలో చూసి ఉండరు (Video)

    Vistadome Train: అద్దాల రైలు వీడియో రిలీజ్ చేసిన భారతీయ రైల్వే (Video)


    గుంతకల్లు రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించడం మాత్రమే కాదు... గుంతకల్ డివిజన్‌లో రైల్వే అభివృద్ధి పనుల్ని చేపట్టింది ఇండియన్ రైల్వేస్. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా గుంతకల్లు డివజన్‌లో జరుగుతున్న ప్రాజెక్ట్స్‌ని పరిశీలించారు. గూడూరు-రేణిగుంట, తిరుపతి-కాట్పాడి మధ్య అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుంతకల్లు పరిధిలోని రైల్వేస్టేషన్లలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోవైపు భారతీయ రైల్వే దేశంలోని వివిధ రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనుల్ని కొనసాగిస్తోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Indian Railway, Indian Railways, Railways, Telugu news, Telugu updates, Telugu varthalu, Train

    తదుపరి వార్తలు