IRCTC: రైలు బయల్దేరే గంట ముందు రిజర్వేషన్ సాధ్యం... ఇదిగో సాక్ష్యం

IRCTC Train Reservation Chart | మొదటి చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత బెర్తులు ఖాళీగా ఉండటంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇలాగే మీరు వెళ్లాలనుకునే రోజు కూడా సెర్చ్ చేసి చూస్తే బెర్తులు ఖాళీగా ఉంటే బుక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: January 10, 2020, 2:57 PM IST
IRCTC: రైలు బయల్దేరే గంట ముందు రిజర్వేషన్ సాధ్యం... ఇదిగో సాక్ష్యం
IRCTC: రైలు బయల్దేరే గంట ముందు రిజర్వేషన్ సాధ్యం... ఇదిగో సాక్ష్యం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సంక్రాంతి సెలవుల్లో ఊరెళ్తున్నారా? రైలు టికెట్లు బుక్ చేశారా? రిజర్వేషన్ కన్ఫామ్ కాలేదా? రైలు టికెట్లు దొరకలేదని ప్రయాణం వాయిదా వేద్దామనుకుంటున్నారా? రైలు టికెట్లను రైలు బయల్దేరడానికి 120 రోజుల ముందు నుంచి బుక్ చేసుకోవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రైలు బయల్దేరే రోజు, అది కూడా 30 నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేయొచ్చన్న సంగతి అతి కొద్దిమందికే తెలుసు. భారతీయ రైల్వే అందిస్తున్న అద్భుతమైన అవకాశం ఇది. మీకు సంక్రాంతి సెలవుల్లో ఊరెళ్లేందుకు రైలు టికెట్లు దొరక్కపోతే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. రైలు బయల్దేరడానికి సరిగ్గా 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఇందులో బెర్తులు ఏవైనా ఖాళీగా ఉంటే చూడొచ్చు. ఇది మొదటి చార్ట్ మాత్రమే. రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు రెండో చార్ట్ కూడా ప్రిపేర్ చేస్తుంది రైల్వే. అప్పటివరకు ఎవరైనా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే బెర్తులు ఖాళీగా ఉంటాయి. రైలు బయల్దేరడానికి 30 నిమిషాల్లోపు ఎవరైనా రిజర్వేషన్ చేయించుకుంటే వారికి టికెట్లు కేటాయిస్తుంది రైల్వే. అయితే నాలుగు గంటల ముందు ప్రిపేర్ చేసే మొదటి చార్ట్ అందుబాటులో ఉంటుందన్న విషయం తెలుసు. కానీ... 30 నిమిషాల ముందు ప్రిపేర్ చేసే రెండో చార్ట్ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఈ వివరాలు చూడొచ్చు. మీకు బెర్తులు ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తే టీటీఈని సంప్రదించొచ్చు. అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. ఉదాహరణకు జనవరి 10న సికింద్రాబాద్ నుంచి రైలు నెంబర్ 12026 పుణె జంక్షన్‌కు మధ్యాహ్నం 02:45 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేస్తే 50 పైగా బెర్తులు ఖాళీగా ఉన్నట్టు కనిపించాయి. ఏ బోగీలో ఏ సీటు ఖాళీగా ఉందో కూడా లే అవుట్ చూసి తెలుసుకోవచ్చు. మొదటి చార్ట్ ఉదయం 10.39 గంటలకే ప్రిపేర్ అయిపోయింది. మొదటి చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత బెర్తులు ఖాళీగా ఉండటంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇలాగే మీరు వెళ్లాలనుకునే రోజు కూడా సెర్చ్ చేసి చూస్తే బెర్తులు ఖాళీగా ఉంటే బుక్ చేసుకోవచ్చు.

IRCTC Train Reservation Chart, Indian Railways Train Reservation Chart, how to check train reservation chart, check train reservation chart, train ticket booking tips, IRCTC ticket booking, IRCTC ticket booking tips, ఐఆర్‌సీటీసీ రైలు రిజర్వేషన్ చార్ట్, ఇండియన్ రైల్వేస్ రైలు రిజర్వేషన్ చార్ట్, రైలు రిజర్వేషన్ చార్ట్ ఎలా చెక్ చేయాలి, రైలు రిజర్వేషన్ చార్ట్, రైలు టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ టిప్స్
image: IRCTC


IRCTC Train Reservation Chart: రైలు రిజర్వేషన్ చార్ట్ చూడండి ఇలా...




ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ https://www.irctc.co.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలోనే 'Book Your Ticket' కింద 'Charts/Vacancy' ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
రైలు పేరు లేదా రైలు నెంబర్, ప్రయాణ తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయండి.బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేయండి.
'Get Train Chart' ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
స్క్రీన్ పైన రిజర్వేషన్ చార్ట్ స్టేటస్ కనిపిస్తుంది.
అందులో రైలు నెంబర్, ప్రయాణ తేదీ, బోర్డింగ్ స్టేషన్, చార్టింగ్ స్టేషన్, మొదటి చార్ట్ తయారైన సమయం లాంటి వివరాలు ఉంటాయి.
అందులో ఏవైనా బెర్తులు ఖాళీగా ఉంటే మీరు ఆన్‌లైన్‌లో లేదా రిజర్వేషన్ కౌంటర్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చార్ట్ చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం



ఇవి కూడా చదవండి:

Sankranti Special Trains: సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల వివరాలివే...

IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ

IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

 
First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు