కాకినాడ ‘కోటయ్య కాజా’కు అరుదైన గౌరవం...

కాకినాడలో కోటయ్య కాజా స్టోర్

కాకినాడ కోటయ్య కాజాకు అరుదైన గౌరవం లభించింది. భారతీయ తపాలా శాఖ ‘కోటయ్య కాజా’ మీద పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది.

  • Share this:
    కాకినాడ అంటే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది కాకినాడ కాజానే. అందులోనూ కోటయ్య కాజా అంటే ఇంకాఎక్కువ పేరు. ఈ ఖ్యాతి ఖండాంతరాలు కూడా దాటింది. విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా కాకినాడ కాజాను రుచి చూడాలనుకుంటారు. అలాంటి కాకినాడ కోటయ్య కాజాకు అరుదైన గౌరవం లభించింది. భారతీయ తపాలా శాఖ ‘కోటయ్య కాజా’ మీద పోస్టల్ కవర్ రిలీజ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. కాజాల్లో పలు రకాలు ఉంటాయి. గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా అని రకరకాలుగా ఉంటాయి. అన్నీ తియ్యగా ఉండేవే. అందులో గొట్టం కాజాకు ఉండే ప్రత్యేకత వేరు. వీటిని నెయ్యి, వనస్పతితో కూడా తయారు చేస్తారు. గొట్టం కాజాను కొరకగానే అందులో ఉన్న పాకం నోటిని తియ్యగా చేసేస్తుంది. ఆ థ్రిల్ తినే వారికి మాత్రమే తెలుస్తుందంటారు. కోటయ్య అనే వ్యక్తి వీటిని తయారు చేయగా, బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ఇతరులు కూడా వీటిని తయారు చేయడం మొదలు పెట్టారు. కాకినాడలోనే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఇలాంటి గొట్టం కాజాలు దొరుకుతున్నాయి. స్వీట్స్ అంటే ఇష్టపడే వారు తప్పకుండా వీటిని రుచి చూస్తారు. అందుకే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా కోటయ్య కాజాలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఆ పేరుతో పోస్టల్ కవర్‌ను రిలీజ్ చేసింది.

    కోటయ్య కాజాపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్
    Published by:Ashok Kumar Bonepalli
    First published: