హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: విశాఖలో భారీ వర్షం.. ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ డౌటే..!

Visakhapatnam: విశాఖలో భారీ వర్షం.. ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ డౌటే..!

విశాఖ స్టేడియం

విశాఖ స్టేడియం

Visakhapatnam: స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు.  భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ఆదివారం విశాఖ (Visakhapatnam) కేంద్రంగా జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌ (IND vs AUS 2nd ODI)కు సర్వం సిద్ధమైంది. అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇరు జట్ల క్రికెటర్లు కూడా విశాఖపట్టణానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా నోవాటెల్ హోటల్‌లో బస చేస్తున్నారు. మ్యాచ్‌కు సంబంధించి అన్ని టిక్కెట్లు బుక్కయ్యాయి. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. అదే జోష్‌తో రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తుందని టీమిండియా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ వరుణుడు మాత్రం అందరి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు.

Good News: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపు వారందరి ఖాతాల్లోకి నగదు

ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఏపీ, తెలంగాణతో అంతటా వర్షాలు పడుతున్నాయి. అవి కూడా సాధారణ వర్షాలు కాదు.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వానలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. రాబోయే రెండు రోజులు కూడా వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఒకవేళ నిన్న, ఇవాళ కురిసినట్లుగా.. ఆదివారం కూడా వర్షం పడితే... మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. ఆదివారం వర్షం కురిసేందుకు 90శాతం అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ఆదివారం వర్షం పడకుంటే బాగుండని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

 Rains: ఏపీ రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

విశాఖలోని క్రికెట్‌ స్టేడియంను  పూర్తి కవర్లతో కప్పి ఉంచారు.  భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. అయితే రోజంతా వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్‌ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక వేళ మ్యాచ్ జరిగి.. ఇండియా గెలిస్తే.. సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. లేదంటే మూడో మ్యాచ్‌లోనే ఫలితం తేలుతుంది. అక్కడ ఇండియా గెలిస్తే సిరీస్ వస్తుంది. ఆస్ట్రేలియా గెలిస్తే.. మ్యాచ్ సమం అవుతుంది.

వన్డే మ్యాచ్ నేపథ్యంలో విశాఖ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులు, గూడ్స్ వాహనాలను హనుమంత వాక, అడవి వరం మీదుగా మళ్లించనున్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళే కార్లు, టూ వీలర్లను హనుమంత వాక నుంచి విశాలాక్షి నగర్ , బీచ్ రోడ్ మీదుగా దారి మళ్లిస్తారు. శ్రీకాకుళం నుంచి వచ్చే బస్సులను మారిక వలస నుంచి బీచ్ రోడ్డు, తెన్నేటి పార్క్, విశాలాక్షి నగర్ మీదుగా నగరంలోకి అనుమతిస్తారు. శ్రీకాకుళం-అనకాపల్లి రూట్లో వెళ్లే వాహనాలను ఆనంద పురం, పెందుర్తి వైపు మళ్లిస్తారు.

First published:

Tags: Cricket, IND vs AUS, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు