హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: విశాఖలో ఇండియా Vs ఆస్ట్రేలియా.. మార్చి 10 నుంచి టికెట్లు..ఇలా బుక్ చేసుకోండి

Visakhapatnam: విశాఖలో ఇండియా Vs ఆస్ట్రేలియా.. మార్చి 10 నుంచి టికెట్లు..ఇలా బుక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Visakhapatnam: ఇండియా, ఆస్ట్రేలియా రెండో మ్యాచ్‌కు టికెట్ల ధరలను రూ.600, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000గా నిర్ణయించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

విశాఖపట్నం (Visakhapatnam)లో క్రికెట్ సందడి నెలకొంది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా టీమ్.. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను కూడా ఆడనుంది. ఇందులో రెండో మ్యాచ్‌ విశాఖలోనే జరగనుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 19న భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లు తలపడనున్నాయి. అందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళవారం స్టేడియంలో మ్యాచ్‌ నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం టికెట్లకు సంబంధించిన వివరాలను ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ACA) కార్యదర్శి గోపీనాథరెడ్డి మాట్లాడుతూ వెల్లడించారు.

Vijayawada: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు పాక్షికంగా రద్దు

మార్చి 10 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని ఆయన చెప్పారు. పేటీఎం ఇన్‌సైడర్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో ఈనెల 13వ తేదీ నుంచి టికెట్ల విక్రయాలు జరుగుతాయి. ఇండియా, ఆస్ట్రేలియా రెండో మ్యాచ్‌కు టికెట్ల ధరలను రూ.600, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000గా నిర్ణయించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలకు విశాఖపట్టణంలోలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆఫ్‌లైన్ కేంద్రాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ టికెట్ల విక్రయాలు జరుగుతాయి. ఆఫ్‌లైన్‌ కేంద్రాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు ఈనెల 13వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌ కేంద్రాల వద్ద ఫిజికల్‌ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌కు బార్‌ కోడ్‌ ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద టికెట్‌పై ఉన్న బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తారు. మార్చి 19న మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి ఇన్నింగ్స్ మధ్యాహ్నం 1.30 నుంచి 5.00 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5.00 నుంచి 5.45 గంటల వరకు 45 నిమిషాల పాటు బ్రేక్‌ ఉంటుంది.  సెకండ్ ఇన్నింగ్స్ సాయంత్రం 5.45 నుంచి మ్యాచ్‌ పూర్తయ్యే వరకు నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. విశాఖలో దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చే అవకాశముంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏసీఏ ప్రతినిధులు తెలిపారు.

First published:

Tags: Cricket, IND vs AUS, Local News, Sports, Visakhapatnam

ఉత్తమ కథలు