కరోనాతో చిత్తూరు విలవిల.. 85కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.. నర్సుకు సైతం..

లాక్‌డౌన్ నేపథ్యంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు లారీలో పుంగనూరు మండలానికి వచ్చారు. అయితే స్వీయ అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ రాగా, మరొకరికి నెగిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: May 7, 2020, 7:53 PM IST
కరోనాతో చిత్తూరు విలవిల.. 85కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.. నర్సుకు సైతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో చిత్తూరు జిల్లా విలవిలలాడుతోంది. రోజురోజూకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్ కేసులు 85కు చేరుకున్నాయి. అయితే తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఉద్యోగం కోసం ఇద్దరు వ్యక్తులు చెన్నై వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు లారీలో పుంగనూరు మండలానికి వచ్చారు. అయితే స్వీయ అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ రాగా, మరొకరికి నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించగా, నెగిటివ్ వచ్చిన వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. వీరితో పాటు తమిళనాడు నుంచి వచ్చిన మరో ఇద్దరికి సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు కోవిడ్-19 ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న మరో నర్సుకు కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో మొత్తంగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 85కు చేరుకున్నాయి. కాగా ఇందులో 17 యాక్టివ్ కేసులు కాగా, 68 మంది డిశ్చార్జి అయ్యారు.
First published: May 7, 2020, 7:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading