లింగమనేని ఎస్టేట్స్‌పై ఐటీ దాడులు...

ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

news18-telugu
Updated: March 4, 2020, 10:21 PM IST
లింగమనేని ఎస్టేట్స్‌పై ఐటీ దాడులు...
లింగమనేని రమేశ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు. రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ అధినేత లింగమనేని రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధాయపన్ను శాఖ దాడులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఉన్న ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి సాయంత్రం 6 గంటల సమయంలో ఐటీ అధికారులు వచ్చారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఆఫీసు బయట భద్రతగా ఉంచారు. లింగమనేని వెంచర్స్‌లో ఉన్న ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతంలో లింగమనేని ఎస్టేట్స్ సంస్థ అక్రమంగా కట్టడాలు చేపట్టారంటూ గతంలో ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇటీవల అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ మీద కేబినెట్ సబ్ కమిటీ కూడా తమ నివేదికలో లింగమనేని రమేష్ పేరును చేర్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 4, 2020, 10:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading