శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు

Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈసారి నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై దాడులు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: March 4, 2020, 11:22 AM IST
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు (File)
  • Share this:
Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఐటీ (ఇన్‌కం టాక్స్) అధికారులు మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో... బెంజ్‌సర్కిల్‌లోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీల క్యాంపస్‌లలో ఐటీ దాడులు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచీ ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా... కొన్ని రికార్డుల్ని అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో... అధికారులు కొన్ని ప్రత్యేక కారణాలు, అనుమానాలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది. ఐటీ తనిఖీల్లో కొన్ని ప్రత్యేక పత్రాలు, రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే... దాడుల వెనక రాజకీయ కోణం ఉండి ఉండొచ్చని కొంత మంది టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ... ఐటీ అధికారులు మాత్రం దీనిపై స్పందించలేదు. తనిఖీలలో వారు నిమగ్నమయ్యారు.
Published by: Krishna Kumar N
First published: March 4, 2020, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading