విశాఖలో ఐటీ అధికారుల మకాం..భారీగా సోదాలు జరిగే ఛాన్స్

శుక్రవారం భారీగా ఐటీ దాడులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలోని కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల నివాసాలపై ఐటీశాఖ అధికారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 24, 2018, 8:54 PM IST
విశాఖలో ఐటీ అధికారుల మకాం..భారీగా సోదాలు జరిగే ఛాన్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్టణానికి ఐటీ అధికారులు భారీగా చేరుకున్నారు. తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు వైజాగ్‌లోని పలు హోటళ్లలో బస చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం భారీగా ఐటీ దాడులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలోని కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల నివాసాలపై ఐటీశాఖ అధికారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం 5 గంటలకు భారీగా ఐటీ అధికారులు చేరుకున్నట్లు సమాచారం. విజయవాడలోనూ ఐటీ దాడులు జరుగుతాయని ఇటీవల ప్రచారం జరిగింది. అందుక తగ్గట్లే అక్కడ ఐటీ దాడులు జరిగాయి. ఈ క్రమంలో విశాఖలోనూ ఐటీ సోదాలు జరుగుతాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 24, 2018, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading