చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత కంపెనీపై ఐటీ దాడులు...

చిత్తూరు జిల్లా పలమనేరులో ఎస్‌కేఎస్ జాఫర్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.

news18-telugu
Updated: February 20, 2020, 2:32 PM IST
చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత కంపెనీపై ఐటీ దాడులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు చెందిన కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎస్‌కేఎస్ జాఫర్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. లారీ డ్రైవర్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు నిర్వహించే స్థాయికి ఎదిగారు జాఫర్. ఈ రోజు ఉదయం నుంచి జాఫర్ ఆఫీసులో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. జాఫర్ గతంలో టీడీపీలో ఉన్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. 2019 ఎన్నికల సమయంలో ఆయన జాఫర్ వైసీపీలో చేరారు. పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన పనిచేసినట్టు తెలిసింది. అయితే, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తరుణంలో ఆయనను వైసీపీలోని ఓ వర్గం వ్యతిరేకించింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జాఫర్ భావిస్తున్నట్టు తెలిసింది.

ఒకప్పుడు జాఫర్ లారీ డ్రైవర్‌గా పనిచేశారు. అనంతరం ఆయనే సొంతంగా లారీలు కొనుక్కుని పెద్ద ట్రాన్స్‌పోర్ట్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆయన అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం జాఫర్ మైనారిటీ వర్గంతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పలమనేరు ఎమ్మెల్యేను ఆహ్వానించలేదని తెలిసింది. దీంతో జాఫర్ ప్రత్యర్థివర్గం ఆయన గురించి ఆదాయపన్ను శాఖకు ఉప్పందించినట్టు భావిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 20, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading