Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు..పోసానిపై కేసు నమోదు..పోరాడి సాధించిన జన సైనికులు

Big News: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు..పోసానిపై కేసు నమోదు..పోరాడి సాధించిన జన సైనికులు

PC: Twitter

PC: Twitter

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సినీ రచయిత పోసాని కృష్ణ మురళి (Posani Krishna murali)పై కేసు నమోదు అయింది. గతంలో రాజమహేంద్ర వరం జనసేన పార్టీ నేత యందం ఇందిరా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక రెండో జేఎఫ్.సి కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355,500. 504, 506, 507, 509 సెక్షన్ల కింద రాజమండ్రి (Rajamundry)లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల పవన్ పై పోసాని తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనిపై జనసేన నాయకులూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీనితో జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆదేశాలతో రాజమండ్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh | Rajahmundry

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సినీ రచయిత పోసాని కృష్ణ మురళి (Posani Krishna murali)పై కేసు నమోదు అయింది. గతంలో రాజమహేంద్ర వరం జనసేన పార్టీ నేత యందం ఇందిరా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక రెండో జేఎఫ్.సి కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355,500. 504, 506, 507, 509 సెక్షన్ల కింద రాజమండ్రి (Rajamundry)లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల పవన్ పై పోసాని తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనిపై జనసేన నాయకులూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీనితో జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆదేశాలతో రాజమండ్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జనసేన సైనికులు పోరాడి సాధించారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

AP Govt Jobs: ఏపీలో 1458 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

కాగా ఇటీవల వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) సీఎం జగన్ మరో కీలకపదవిని ముట్ట జెప్పారు. పోసాని కృష్ణమురళీని తాజాగా ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ((AP Film Development Corporation Chairman)) నియమించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలోనే ఉంటున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం కూడా చేశారు పోసాని. ఇక మరోవైపు వీలున్నప్పుడల్లా పోసాని జనసేన పార్టీ (Janasena Party) పై, అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) విమర్శలు చేయడం వంటివి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, పోసానికి ఈ కీలకపదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఆలీ ((Comedian Ali) ) కూడా వైసీపీకి చాలా దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలీ, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపునా ప్రచారం కూడా చేశారు. ఇక పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది. అందులోనే భాగంగా ఆలీకి కాస్తా లేటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా (Electronic Media Advisor to AP Govt)  నియమించారు.

First published:

Tags: Ap, AP News, Janasena, Pawan kalyan, Posani Krishna Murali, Rajamundry

ఉత్తమ కథలు