హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

BRS Plans: ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరంటే..?

BRS Plans: ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరంటే..?

ఏపీ నాయకులతో కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఏపీ నాయకులతో కేసీఆర్ (ఫైల్ ఫోటో)

BRS Plans: ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) హాజరుకానున్నారు. జనసేన పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ సభ ఏర్పాటు లోగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది.. ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

BRS Palns:  ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) భారత్‌ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్ ) (BRS) విస్తరణపై గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) హాజరుకానున్నారని తెలుస్తోంది. జనసేన (Janasena) పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరిన నేతలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ (Thota Chandrasekhar) , పార్టీ నేత చింతల పార్థసారథి (Chintala Prathasarathi) లు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.

ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంతోపాటు ఆవిర్భావ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా త్వరలోనే సభా వేదిక, నిర్వహణ తేదీలను ప్రకటించనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయాన్నితీసుకెళ్తామన్నారు చంద్రశేఖర్. మరోవైపు ఈ సభ ఏర్పాటులోపే.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఎంపిక పూర్తి చేయాలని చూస్తున్నారు.

అయితే ఇటీవల భారత రాష్ట్ర సమితిలో చేరిన మాజీ మంత్రి రావెల.కిషోర్ బాబుకు త్వరలోనే బి.ఆర్.ఎస్ లో కీలక భాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది.  కే.సి.ఆర్. దేశవ్యాప్తంగా పార్టీ ని బలోపేతం చేసే పనిలో ఉన్న ఆయన ఢిల్లీలో లాబీయింగ్ చేసే బలమైన నేత లేకపోవడంతో పార్టీకి కొంత మేర ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు.

ఇదీ చదవండి : చంద్రబాబుకు పవన్ ఫుల్ సపోర్ట్.. జగన్ సర్కార్ తీరుపై ఫైర్

ఐ.ఆర్.ఎస్ అధికారిగా వ్యవహరించిన కిషోర్ బాబుకు కేంద్రంలో  పెద్దలతో కలిసి పనిచేసిన అనుభవం ఉందనేది  బి.ఆర్.ఎస్ నేతల ఆలోచన. అందుకే రావెల కిషోర్ బాబుని జాతీయ కార్యదర్శిగా ప్రకటించడం ద్వారా పార్టీకి మరింత లబ్ది చేకూరుతుందనేది కే.సి.ఆర్ ఆలోచనగా ఉందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా సామాజిక పరంగా వెనుకబడిన వర్గానికి చెందిన కిషోర్ బాబును కీలకమైన పదవిలో కూర్చోబెట్టడం ద్వారా   ప్రతిపక్షాల నోళ్ళు మూఇంచడమే గాక దేశవ్యాప్తంగా ఎస్.సి, ఎస్టీల మద్దతు కూడగట్టవచ్చు అనేది ఆ పార్టీ పెద్దల భావనగా ఉందట.

ఇదీ చదవండి: వైకుంఠ ద్వారా దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శన టోకెన్ల జారీ కౌంటర్లలో మార్పు

మరోవైపు చాలా మంది సిట్టింగ్ లు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన మరో బాంబు పేల్చారు. అధికార వైసీపీ లో అసమ్మతులను గుర్తించి వారికి కూడా కే.సి.ఆర్ గాలం  వేస్తున్నట్లు సమాచారం. దాదాపు గా 75 నుండి వంద మంది సిట్టింగ్ లకు ఈ సారి జగన్ మొండిచేయి చూపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో అక్కడ సీటు దక్కని వారిని తనవైపునకు తిప్పుకోవాలనే  ఆలోచనలో ఉన్నారంట కే.సి.ఆర్.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, BRS, CM KCR, KCR New Party

ఉత్తమ కథలు