హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: నరికేసిన కొమ్మకే విరగకాసింది.. మామిడిలో ఈ మామిడి వేరయా..

Andhra Pradesh: నరికేసిన కొమ్మకే విరగకాసింది.. మామిడిలో ఈ మామిడి వేరయా..

నరికేసిన కొమ్మకే విరగకాసిన మామిడి

నరికేసిన కొమ్మకే విరగకాసిన మామిడి

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్.. అయినా చాలా చోట్ల దిగుబడి సరిగా కనిపించడం లేదు. చాలా చెట్లు కాయలు లేక వెల వెల బోతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ చెట్టు మాత్రం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?

  మనిషి నిలబడి విశ్రాంతి తీసుకునేందుకు చెట్టు నీడను ఇస్తుంది.. ఒకటేంటి చెట్టు కారణంగా కలిగే లాభాలు అన్నా ఇన్నా.. ఆక్సిజన్ అందించడం దగ్గర నుంచి మనకు రుచికరమైన పండ్లు.. ఇంటి నిర్మాణానికి కావాలసిన కలప ఇవ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ప్రయోజనాలు ఉంటాయి. కానీ అలాంటి చెట్లను మాత్రం మనిషి నరికేస్తుంటాడు. అయినా మనుషులకు చెట్లు ఎప్పుడూ ఉఫయోపడుతూనే ఉన్నాయి. అన్నీ తెలిసినా మానవుడికి బుద్ధి మారడం లేదు. ఎప్పటికప్పుడు ప్రకృతి మనిషికి పాఠాలు చెబుతున్నా మనిషి పర్యావరణాన్ని నాశనం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రకృతిలో భాగమైన చెట్లు మాత్రం మనిషిని బ్రతికిస్తునే ఉన్నాయి. ప్రాణవాయువుని ఇచ్చి.. పండ్లను ఇచ్చీ..నీడను ఇచ్చి కాపాడుతున్నాయి. అందుకే ఈ కరోనా కాలంలో చెట్టు చేసిన మేలు తల్లి కూడా చేయదు అనాలి ఏమో..

  సాధరణంగా బాగా కాయలు కాసే చెట్టును కాని.. వాటి కొమ్మలను కాని ఎవరూ నరికే ప్రయత్నం చేయరు.. ఆ చెట్టు కాయల దిగుబడి తగ్గినా.. పూత పూయడం లేదని తెలిసినా ఆ కొమ్మలను మాత్రమే నరికే ప్రయత్నం చేస్తారు.. అయితే చెట్టు అంతా  ఫలాలు కాసినా..  నరికేసిన కొమ్మలు ఉంటే .. అవి మావువుగానే కనిపిస్తాయి.  ఆ విరిగిన కొమ్మకు కాయలు కాయడం ఇఫ్పటి వరకు ఎవరూ చూసి ఉండరేమో.. కానీ ఈ చెట్టు మాత్రం అన్నింటిలో భిన్నం.. మామిడిలో ఈ మామిడి పళ్లు వేరయా అనుకోవాలేమో..  ఎందుకంటే  కొట్టేసిన కొమ్మకు కూడా ఎవరూ ఊహించని విధంగా మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా విరగకాశాయి. కత్తివేటుకు ఒరిగిన కొమ్మే పట్టుగొమ్మై ఫలించింది. కొట్టేసిన మొద్దుకే మామిడికాయలు గుత్తులు గుత్తులుగా విరగకాసింది. దీంతో అంతా ఈ చెట్టును చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొట్టేసిన కొమ్మకు ఇన్ని కాయలు ఎలా కాసియి అని నోరు వెళ్లబెడుతున్నారు.

  ఏపీలోని కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఓ టీచర్ వ్యవసాయ క్షేత్రంలోని ఓ మామిడి కొమ్మకు అదికూడా కొట్టేసిన కొమ్మ కాయల్ని విరగకాసింది. 40 ఏళ్ల క్రితం నాటిన దేశవాళీ మామిడి చెట్ల కొమ్మలను కొంతకాలం క్రితం నరికించారు. ప్రస్తుతం ఆ నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి అందరినీ అబ్బురపరుస్తున్నాయి. అటు వెళ్లిన వరాంతా ఆ చెట్టును చూసి కాసేపు ఆగి షాక్ కు గురి అవుతున్నారు. నరికేసిన కొమ్మకు అన్ని కాయాలు ఎలా కాశాయా అని లోచిస్తున్నారు. దీంతో ఆ ఫోటో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: AP News, Krishna District

  ఉత్తమ కథలు