హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..సర్వేకు ఆదేశించిన కోర్టు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

Ap: విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..సర్వేకు ఆదేశించిన కోర్టు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేడు రిషికొండ తవ్వకాలపై వేసిన పిటిషన్ లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రుషికొండ తవ్వకాల్లో భాగంగా అదనంగా 3 ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిగాయని సర్కార్ తెలిపింది. కానీ  3 ఎకరాలు కాదు 20 ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా రుషికొండ తవ్వకాలపై సర్వే చేయాలని కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖను ఆదేశించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

విశాఖపట్నం (Visakhapatnam)లోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేడు రిషికొండ తవ్వకాలపై వేసిన పిటిషన్ లపై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. రుషికొండ తవ్వకాల్లో భాగంగా అదనంగా 3 ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిగాయని సర్కార్ తెలిపింది. కానీ  3 ఎకరాలు కాదు 20 ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా రుషికొండ తవ్వకాలపై సర్వే చేయాలని కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖను హైకోర్టు (High Court) కోరుతూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

PM Modi: ప్రధాని వైజాగ్ టూర్ షెడ్యూల్ ఇదే..! నెరవేరనున్న ఉత్తరాంధ్ర వాసుల కల..!

అనుమతికి మించి తవ్వకాలు ఎంతమేర జరిగాయి..ఎంతమేర భవనాలు నిర్మించారో సర్వే చేసి వివరాలు సమర్పించాలని కోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ సమర్పించిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 14 వరకు వాయిదా వేసింది. కాగా రుషికొండ పరిధిలో నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో (High Court) పిల్ దాఖలు చేసిన సంగతి విషయం తెలిసిందే.

Ayyannapatrudu: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..మధ్యాహ్నం విచారణ జరిగే ఛాన్స్

అయితే ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిటిషన్ తరపున న్యాయవాది మూర్తి పిల్ దాఖలు చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను నిర్ధారించేందుకు హైకోర్టు (High Court) రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. ఈ పిటీషన్ లపై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. అయితే గతంలో రుషికొండ తవ్వకాల్లో 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరపున న్యాయవాదులు చేప్పారు.

అయితే ఈ వాదనలను ప్రభుత్వం తరపున న్యాయవాది ఖండించారు. కేవలం అనుమతి ఉన్న 9.88 ఎకరాల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. పర్యావరణ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతి మేరకు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయన్నారు.  దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేస్తామని అప్పటివరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపున పిటిషనర్ కోరారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి విచారణను నేటికీ వాయిదా వేసింది.

First published:

Tags: Ap, Highcourt, Vizag

ఉత్తమ కథలు