హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బంగాళాఖాతంలో అల్పపీడనం.. పెను తుఫానుగా మారే ప్రమాదం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. పెను తుఫానుగా మారే ప్రమాదం..

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దాని ప్రభావంతో రేపు (ఈ నెల 15వ తేదీన) దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, 16వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వివరించింది. అల్ప పీడన ప్రభావంతో నేడు, రేపు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15 తర్వాత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, తుఫానుకు ‘ఎంఫాన్’ అని పేరు పెట్టారు.

First published:

Tags: Cyclone, Telugu news, WEATHER

ఉత్తమ కథలు