హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ap rains : ఏపీకి భారీ వర్ష సూచన, telanganaలోనూ కురుస్తాయన్న IMD -బంగాళాఖాతంలో అల్పపీడం

ap rains : ఏపీకి భారీ వర్ష సూచన, telanganaలోనూ కురుస్తాయన్న IMD -బంగాళాఖాతంలో అల్పపీడం

కర్ణాటక తీరానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం కొనసాగుతోందని.. ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

కర్ణాటక తీరానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం కొనసాగుతోందని.. ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీ(మంగళవారం) అల్పపీడనం ఏర్పడనున్నది. దీంతో ఈనెల 12 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

నవంబర్ నెలలోనూ దక్షిణాదిలో వానలు దంచికొడుతున్నాయి. తమిళనాడులో కుండపోత కారణంగా చెన్నై నగరం ఇప్పటికే నీట మునిగిపోగా, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో అక్కడ పలు జిల్లాల్లో సెలవు ప్రకటించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది.

బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీ(మంగళవారం) అల్పపీడనం ఏర్పడనున్నది. దీంతో ఈనెల 12 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ప్రధానంగా చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, అనంతపురం, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తీర ప్రాంతంలోని జిల్లాకు ఐఎండీ అదనపు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఐఎండీ సూచనల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలెర్ట్ అయింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఉపరితల ధ్రోణి కారణంగా నెల్లూరుజిల్లాలో గడిచిన రెండు రోజులుగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.

అటు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో.. అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక భారీ వర్షాల కారణంగా వరి మరియు పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పూర్తిగా చేను పైనే ఉండటంతో… నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో మరో రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, కేరళ, పాండిచేరిలోనూ రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, IMD, Rains, Telangana

ఉత్తమ కథలు