కోస్తాకు భారీ వర్షసూచన... రేపట్నుంచి వానలే వానలు

కోస్తా జిల్లాల్లో శనివారం నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

news18-telugu
Updated: June 29, 2019, 8:45 AM IST
కోస్తాకు భారీ వర్షసూచన... రేపట్నుంచి వానలే వానలు
IMD forecasts heavy rains in next three days in Coastal Andhra, Rayalaseema, కోస్తాకు భారీ వర్షసూచన.. రేపట్నుంచి వానలే వానలు
news18-telugu
Updated: June 29, 2019, 8:45 AM IST
ఉత్తర బంగాళాఖాతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా ఈ నెల 30వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇందుకు అనుకూలమైన వాతావరణం స్థానికంగా ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోందని చెప్పారు. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించారు. దీని ఫలితంగా కోస్తా జిల్లాల్లో శనివారం నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

రానున్న 4 రోజుల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అమలాపురంలో అత్యధికంగా 13 సెం.మీ భారీ వర్షపాతం నమోదైంది. గుడివాడలో 7 సెం.మీ వర్షం కురిసింది.ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత మూడురోజులుగా హైదారబాద్‌లో కూడా వాతావరణం చల్లగా మారింది. మూడురోజులుగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఎండలకు అల్లాడిన ప్రజలంతా వానలతో సేదతీరుతున్నారు. మరోవైపు రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్నారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...