హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

rains : రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు : IMD హెచ్చరిక

rains : రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు : IMD హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు తెలుగు రాష్ట్రాలకు తాజాగా వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. జవాద్ ముప్పు తప్పినా మరో అల్పపీడం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఇటు తెలంగాణలోనూ రాబోయే మూడు రోజులపాటు వానలు కురుస్తాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో సూచనలు జారీ చేశాయి.

ఇంకా చదవండి ...

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్రమంగా మరుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి పెరుగుతోంది. రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తిన వానల విధ్వంసం మరువక ముందే, జవాద్ దూసుకురావడం, అదృష్టవశాత్తూ అది రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లడంతో ఊపిరిపీల్చుకున్నా, మరో అల్పపీడం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఇటు తెలంగాణలోనూ రాబోయే మూడు రోజులపాటు వానలు కురుస్తాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో సూచనలు జారీ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఇలా ఉండబోతోంది..

తెలంగాణలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, బుధ, గురువారాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నారు.

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్ఏపీకి సంబంధించి.. బంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్‌ తుఫాన్‌ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటినా.. పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా రాబోయే రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్‌ తుఫాన్‌ బలహీన పడటంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ర్టాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

High Court: కుటుంబంలో కన్న కూతురు కంటే కోడలికే ఎక్కువ హక్కులుంటాయి.. ఆమె విధవరాలైనా సరే..ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. జవాద్‌ తుపాన్‌ బలహీన దక్షిణా కోస్తాలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో పెద్దగా మార్పులేమి ఉండవు. ఇటీవల వర్షాలకు అతలాకుతలమైన రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ వాతావరణం పొడిగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగాపెరుగుతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లాల వద్ద అనే విషయంపై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

First published:

Tags: Andhra Pradesh, IMD, Rains, Telangana, Weather report

ఉత్తమ కథలు