ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది. దుకాణాలను కూడా తగ్గించింది. అంతేకాదు ఏఫీలో బ్రాండెడ్ మద్యం బాటిళ్లు అస్సలు దొరకవు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం ఏరులై పారుతోంది. సరిహద్దుల్లో చెక్పోస్టులుప పెట్టి తనిఖీలు చేస్తున్నా.. అక్రమ రవాణా ఆగడం లేదు. నిత్యం పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు పట్టబడుతున్నాయి. పోలీసుల నిఘా పెరగడంతో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. శరీరానికి మద్యం బాటిళ్లు చుట్టుకొని ఏపీ సరిహద్దులోకి ప్రవేశించిన ఇద్దరు యువకులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
రోజూలాగే కృష్ణా జిల్లా విస్సనపేట పోలవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ బైక్పై ఇద్దరు యువకులు తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించారు. వాళ్లు చూడడానికి కాస్త లావుగా ఉన్నారు. సిక్స్ ప్యాక్ ఉన్నట్లు వారి బాడీలు కనిపించాయి. ఏదో తేడాగా ఉందే.. అని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ మధుబాబుకు అనుమానం వచ్చింది. వెంటనే బైక్ను ఆపి.. చొక్కాలను విప్పించగా వీరి బాగోతం బయపడింది. శరీరం చుట్టూ బాటిళ్లు పెట్టుకొని.. వాటిని ప్లాస్టర్తో అతికించి..పైన చొక్కా ధరించారు. వారిని అరెస్ట్ చేసి 101 మద్యం బాటిళ్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి రోజు ఇలాగే మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టైన యువకులు స్వస్థల అశ్వారావుపేట అని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Liquor policy, Liquor sales, Wine shops