తెలంగాణ టు ఏపీ మద్యం తరలింపులో ఇదో కొత్త ఐడియా...

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు విపరీతంగా ఉండడంతో తెలంగాణ నుంచి కొందరు ఏపీకి లిక్కర్ అక్రమంగా తరలించి అక్కడ విక్రయిస్తున్నారు.

news18-telugu
Updated: June 27, 2020, 3:37 PM IST
తెలంగాణ టు ఏపీ మద్యం తరలింపులో ఇదో కొత్త ఐడియా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు విపరీతంగా ఉండడంతో తెలంగాణ నుంచి కొందరు ఏపీకి లిక్కర్ అక్రమంగా తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. తాజాగా, అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నుంచి గుంటూరు జిల్లా నూకలపేటకు మద్యం బాటిళ్లు తరలిస్తూ దబ్బాకు పల్లి వద్ద ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. గుంటూరు నూకల పేట, అందుకూరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై బియ్యం బస్తాలతో తెలంగాణ నుంచి గుంటూరు జిల్లా వెళ్తున్నారు. పోలీసు సిబ్బందికి బియ్యం బస్తాలపై అనుమానం వచ్చి వాటిని తనిఖీ చేయగా, రెండు బియ్యం బస్తాలు, ఒక బ్యాగ్ లో మొత్తం 371 మద్యం బాటిల్ గుర్తించారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 80 కేజీల బియ్యం, రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వాహన తనిఖీ లో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సుధాకర్, గోపి, వెంకటేష్ లను నందిగామ డీఎస్పీ రమణ మూర్తి అభినందించారు.

వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వేరుశనగల ఆటోల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురు నిందితులను సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్​స్టేషన్ పరిధిలోని దుర్గాపురం స్టేజీ వద్ద కోదాడ పట్టణం నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు.
First published: June 27, 2020, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading