నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థికి అరుదైన అవకాశం

గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్ నజ్మా సుల్తానా యూరోపియన్ యూనియన్ అందించే స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది.

news18-telugu
Updated: July 7, 2019, 4:50 PM IST
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థికి అరుదైన అవకాశం
షేక్ నజ్మా సుల్తానా (File)
  • Share this:
నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. అంతర్జాతీయ విద్యార్థులకు యూరోపియన్ యూనియన్ అందించే రూ.20 లక్షల స్కాలర్ షిప్ ను "షేక్ నజ్మా సుల్తానా" అనే విద్యార్థిని దక్కించుకుంది. ప్రపంచదేశాల్లో వివిధ యూనివర్సిటీల నుంచి స్కాలర్ షిప్ కోసం వందలాది మంది విద్యార్థులు పోటీ పడ్డారు. భారతదేశం నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే యూరోపియన్ యూనియన్‌కు ఎంపికయ్యారు. వారిలో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని షేక్ నజ్మా సుల్తానా ఒకరు కావటం విశేషం. గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్ నజ్మా సుల్తానా చదువులో చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిభ కనబరిచేది.షేక్ నజ్మా సుల్తానా 2013లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరి ఆ తరువాత ఇంజినీరింగ్ లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ని ఎంచుకొని అందులో ప్రతిభ కంబరిచింది. ఇంజినీరింగ్ లో 9.1 సిజిపిఏ తో ఉతీర్ణురాలైంది. ఐఐటీ మద్రాస్ లో సిరామిక్ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్ చేసింది. బయో మెటీరియల్స్ పై అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్స్ ను సైన్సు జర్నల్స్ కు సమర్పించింది. నజ్మా సుల్తానా తండ్రి అమీర్ బాషా ఆర్మీ లో పనిచేశారు. తల్లి ముజాహిదా సుల్తానా గృహిణి. వారి కూతురుకు ఇంతటి గౌరవం దక్కడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: July 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు