మే 23న టీడీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులేవీ కనిపించకపోవచ్చు. అలా కాకుండా వైసీపీ గెలిస్తే మాత్రం ఎప్పుడూ లేని సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా... వైఎస్ రాజశేఖర రెడ్డి తదనంతరం... ఆయన కొడుకుగా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి... ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తమను రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో మంది ప్రముఖ నేతలు, వ్యాపార వేత్తలు, శత్రువులు నరకం చూపించారని భావిస్తున్నారట జగన్. ఏపీ ఎన్నికల్లో గెలిస్తే, ప్రత్యర్థుల నోళ్లు మూసుకుంటాయని ఆయన సన్నిహితులు జగన్‌తో అన్నట్లు తెలిసింది. ఐతే... ఎన్నికల్లో గెలిస్తే, ముఖ్యమంత్రి పీఠం ఎక్కే జగన్... రాష్ట్ర అభివృద్ధి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సొంత వ్యాపారాలు, కుటుంబ వ్యాపారాలు అన్నింటికీ ప్రాధాన్యం తగ్గించుకునే పరిస్థితి ఏర్పడక తప్పదు. ఎందుకంటే... టీడీపీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెయ్యలేదంటున్న వైసీపీ... తాను కచ్చితంగా అభివృద్ధి చేసి చూపించాల్సి ఉంటుంది. లేదంటే, అవే విమర్శలు ఆ పార్టీకీ ఎదురవ్వక తప్పదు.
ఏపీ పాలనపై జగన్ దృష్టిపెడితే, ఆయన శత్రువులు, ప్రత్యర్థుల సంగతి తేల్చే పనిని ఆయనకు అత్యంత నమ్మకమైన అనుచరగణం చూసుకుంటుందని తెలిసింది. ప్రస్తుతం జగన్‌కి ప్రధాన శత్రువుగా ఉన్నది టీడీపీ అధినేత చంద్రబాబేనన్నది అందరికీ తెలిసినదే. ఐతే చంద్రబాబుతో పాటూ... పదేళ్లుగా జగన్‌ను చాలా మంది టార్గెట్ చేశారు. లక్ష కోట్లు మింగేశారని విమర్శించారు. 30 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారు. దర్యాప్తు సంస్థలపై ఒత్తిళ్లు తెచ్చి మరీ జగన్ ఆర్థిక ఎదుగుదలపై ఆటంకాలు సృష్టించారని భావిస్తున్న ఆయన అనుచరులు... మే 23 తర్వాత అధికారంలోకి వచ్చి, ప్రత్యర్థులపై ఉన్న పాత కేసుల్ని తిరగదోడతారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ లిస్ట్ రెడీ చేశారనీ, అందులో దాదాపు వంద మందికి పైగా ప్రముఖుల పేర్లు ఉన్నాయని లోటస్ పాండ్ నుంచీ ప్రచారం జరుగుతోంది.
మీడియాపై కత్తి దూస్తారా : ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దాదాపు 10 ఛానెళ్లు టీడీపీకి అనుకూలంగా ప్రసారాలు చేస్తున్నాయనీ, అర డజను పత్రికలు కూడా టీడీపీకే కొమ్ము కాస్తున్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఐతే... అధికారంలో ఎవరు ఉంటే, మీడియా కూడా వారికి అనుకూలంగా మారుతోందన్న విమర్శలున్న తరుణంలో... వైసీపీ అధికారంలోకి వస్తే... ఛాలా ఛానెళ్లు కూడా తమ బ్రాండ్ మార్చుకొని... వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాయని తెలుస్తోంది.
తీరు మార్చుకోకుండా వివక్షతో కూడిన వార్తల్ని ఇచ్చే ఛానెళ్లు కచ్చితంగా ఆధారాలు చూపించాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందనీ, ఆధారాలు చూపించకపోతే, ఆయా ఛానెళ్ల మేనేజ్‌మెంట్లను చట్టపరంగా ఎదుర్కుంటారని తెలుస్తోంది. అవసరమైతే చరిత్రను తవ్వి తీసి... ప్రజల ముందు పెట్టేలా వైసీపీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు అంటే ఏంటి..? అక్కడ నోటాకు వెయ్యడమే బెటరా..?
ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...
దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?
చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Tdp, Ycp, Ys jagan mohan reddy, Ysrcp