• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • IF KIA MOTORS IS DECIDING TO MOVE THIS WILL HAVE A NEGATIVE IMPACT ON ANDHRA PRADESH FUTURE SAYS MP GALLA JAYADEV NK

KIA Motors : కియా మోటార్స్‌ తరలింపు అంశంపై ఆ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు...

KIA Motors : కియా మోటార్స్‌ తరలింపు అంశంపై ఆ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు...

కియా మోటార్స్ లోగో

KIA Motors : ఆంధ్రప్రదేశ్ నుంచీ కియా మోటార్స్ తరలింపు అంశం పెను దుమారం రేపుతోంది. దీనిపై రాజకీయ నేతలు ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Last Updated:
  • Share this:
    KIA Motors : దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌ నుంచీ తమిళనాడుకు తరలిపోవడం తథ్యమంటున్నారు చాలా మంది రాజకీయ నేతలు. రాయిటర్స్ సంస్థ వెలువరించిన కథనం నిజమే అయివుంటుందని అంటున్నారు. దీనిపై కియా మోటార్స్, ఏపీ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ... రాయిటర్స్ కథనాన్ని కొట్టిపారేస్తున్నా... ప్రతిపక్ష రాజకీయ నేతలు మాత్రం కియా మోటార్స్ తరలిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ స్పందించాలని టీడీపీ సీనియర్ నేత దేవి నేనీ ఉమ డిమాండ్ చెయ్యగా... తాజాగా టీడీపీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కూడా స్పందించారు. ఒకవేళ కియా మోటార్స్... తన రూ.7387 కోట్ల విలువైన ప్లాంటును అనంతపురం నుంచీ తమిళనాడుకు తరలిస్తే... ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు అనూహ్యమైనవన్నారు. గత డిసెంబర్‌లోనే ఉత్పత్తిని ప్రారంభించిన ఈ కంపెనీ... కొన్ని నెలలకే తరలిపోతే... ఆ ప్రభావం ఏపీ భవిష్యత్తుపై, ఏపీకి వచ్చే కంపెనీల పెట్టుబడులపై, ఉద్యోగాల కల్పనపై, నెక్ట్స్ తరాలపై... వ్యతిరేక ప్రభావం చూపుతుందని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.


    ఇప్పటికే గల్లా జయదేవ్... అమరావతి నుంచీ రాజధానిని తరలిస్తూ... విశాఖను పరిపాలనా రాజధానిగా చెయ్యాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇదే అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తిన ఆయన... దేశంలో ఏ రాష్ట్రానికీ మూడు రాజధానులు లేవన్నారు. రాజధాని రాష్ట్ర సమస్య కాదు.. జాతీయ సమస్య అన్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు 29వేల మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారనీ... ఇప్పుడు భూములిచ్చిన రైతులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్రం ఎలాంటి సూచనలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే... దీనిపై కేంద్ర ప్రభుత్వం... తొలిసారి అధికారికంగా స్పందించింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని లిఖిత పూర్వరకంగా స్పష్టం చేసింది.

    రాయిటర్స్ ఏమందంటే : ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల కిందటే... తొలి కారును రిలీజ్ చేసిన దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్... ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తోందనీ, రూ.7387 కోట్ల విలువైన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించే ఆలోచనలో ఉందనీ రాయిటర్స్ సంస్థ సంచలన కథనం ఇచ్చింది. ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని తెలిసింది. రెండేళ్ల పాటూ నిర్మించిన తర్వాత... గత డిసెంబర్‌లో కియా మోటార్స్... ఏపీలోని అనంతపురం జిల్లాలో... తన కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌కి ఏటా 300000 లక్షల కార్లను తయారుచేసే సత్తా ఉంది. అలాగే... 12000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ జోరుగా ఉంది. వాహనాల చాలా పార్టులు అక్కడి నుంచే సప్లై అవుతున్నాయి. అందువల్లే కియా మోటార్స్ కూడా అక్కడికి తరలిపోయే ఆలోచనలో ఉందని రాయిటర్స్ వివరించింది.

    ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కియామోటార్స్... ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపిందనీ... వచ్చే వారం సెక్రెటరీ స్థాయిలో చర్చలు జరగనున్నాయనీ... అప్పుడు ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుందని ఓ ప్రభుత్వాధికారి తమకు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు