టీటీడీలో తొలి మహిళా అధికారిగా ఎస్.భార్గవి...

ఎస్. భార్గవి, టీటీడీ జేఈఓ

తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి మహిళా అధికారిగా ఐఏఎస్ అధికారిణి ఎస్. భార్గవి నియమితులయ్యారు.

  • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి మహిళా అధికారిగా ఐఏఎస్ అధికారిణి ఎస్. భార్గవి నియమితులయ్యారు. టీటీడీ జేఈవోగా (వైద్యం, విద్య) ఆమె బాధ్యతలను స్వీకరించారు. 1976 జూన్ 3న జన్మించిన ఎస్. భార్గవి బీఎస్సీ హోమ్ సైన్స్ చదివారు. 2015లో ఐఏఎస్‌కు సెలక్ట్ అయ్యారు. ఆమె నియామకానికి సంబంధించి మే 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఆమె బాధ్యతలను స్వీకరించారు. కొన్ని రోజులుగా ఆమె పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. టీటీడీలో హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలను చూడడానికి ఓ మహిళా అధికారిని నియమించడం ఇదే తొలిసారి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: