ఏపీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నీలం సహానీ..

ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో మళ్ళీ విధులు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

news18-telugu
Updated: November 14, 2019, 2:22 PM IST
ఏపీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నీలం సహానీ..
ఏపీ సీఎస్ నీలం సహానీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో మళ్లీ విధులు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్‌గా తన వృత్తి జీవితం మొదలు అయిందని గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. 1984 బ్యాచ్‌కు చెందిన సహానీ.. రెండు రోజుల క్రితం కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఆమె కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఆమెకు 2020 జూన్ 30 వరకు ఆమె పదవీ కాలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసిన సహానీ.. టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్‌‌గా విధులు నిర్వహించారు. మునిసిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పీడీగా పనిచేశారు. నిజామాబాదు జిల్లా పీడీ డీఆర్డిఏగా, ఖమ్మం జిల్లాల్లో కాడా అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు. ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలెక్టర్ గాను, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్‌గా, టీఆర్అండ్‌బీ కార్యదర్శిగా పనిచేశారు. అదే విధంగా క్రీడల శాఖ కమిషనర్ అండ్ సాప్ వీసీ అండ్ ఎండీగాను పని చేశారు.

అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం, ఎంపవర్‌మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె.. నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading