హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP boy creates World Record: వయసు ఎనిమిదేళ్లు... లక్ష్యం ఎవరెస్ట్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐఏఎస్ తనయుడు..

AP boy creates World Record: వయసు ఎనిమిదేళ్లు... లక్ష్యం ఎవరెస్ట్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐఏఎస్ తనయుడు..

కుమారుడితో గంధం చంద్రుడు

కుమారుడితో గంధం చంద్రుడు

IAS Gandham Chandrudu: 8ఏళ్ల వయసులో స్కూల్ కి వెళ్లిరావడం, హోమ్ వర్క్ చేయడం, బొమ్మలతో ఆడుకోవడమే పిల్లలకు తెలిసింది. కానీ ఓ చిచ్చరపిడుగు ఏకంగా ఎవరెస్టునే టార్గెట్ చేశాడు.

  Young Mountaineer: లక్ష్య సాధనకు వయసుతో సంబంధం లేదు. హోదాతో సంబంధం లేదు. అనుకున్నది సాధించాలంటే కృషి పట్టుదల అవసరం. ఇలాంటి మాటలు డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి స్థిరపడాలనే యువతకు సరిగ్గా సరిపోతాయి. కానీ ఎనిమిదేళ్ల వయసున్న చిన్న పిల్లాడికి లక్ష్యం అంటే ఏంటో పూర్తి అర్ధం తెలియక పోవచ్చు. 8ఏళ్ల వయసులో స్కూల్ కి వెళ్లిరావడం, హోమ్ వర్క్ చేయడం, బొమ్మలతో ఆడుకోవడమే పిల్లలకు తెలిసింది. కానీ ఓ చిచ్చరపిడుగు ఏకంగా ఎవరెస్టునే టార్గెట్ చేశాడు. అందుకు తగ్గట్లే సాధన చేశాడు. ఈ క్రమంలో ప్రమాదకరమైన పర్వాతాలనే అధిరోహించి రికార్డు సృష్టించాడు. తండ్రి ఉన్నత చదువులు, పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తుంటే.. ఈ బుడతడు మాత్రం తనకు నచ్చిన, తాను మెచ్చిన క్రీడలో అద్భుతాలు సృష్టించే దిశగా సాగుతున్నాడు.

  ఐఏఎస్ గంధం చంద్రుడు (IAS Gandham Chandrudu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్ గా ఎదిగారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. టికెట్ కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు గంధం చంద్రుడు తనుయుడు గంధం భువన్ జై.. పర్వతారోహణలో రికార్డు సృష్టించాడు. కేవలం 8ఏళ్ల 3నెలల వయసులో యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్ బ్రస్ శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఈ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడిగా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. 5642 ఎత్తున్న ఈ పర్వతాన్ని భువన్ జై ఈనెల 18న అధిరోహించాడు.

  ఇది చదవండి: సీఎం జగన్ కు కానుకగా బాలాపూర్ లడ్డూ.., రికార్డు ధరకు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ..


  క్రీడల్లో చురుగ్గా ఉండే భువన్ జయ్ ను తండ్రి గంధం చంద్రుడు మౌంటేనీరింగ్ లో ప్రోత్సహించారు. దీంతో అతడికి గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత భువనగిరిలోని ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందించిన అనంతరం ఈ ఏడాది జూలై 21న లఢఖ్ లోని ఖర్దుంగ్లా పర్వతాన్ని అధిరోహించాడు. తాజాగా మౌంట్ ఎల్ బ్రుస్ ను అధిరోహించి ఏకంగా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఈ సందర్భంగా తన కోచ్ లు శంకరయ్య, శేఖర్ బాబు, అన్మిష్ వర్మ, నవీన్ మల్లేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

  ఇది చదవండి: అగ్రవర్ణపేదలకు సువర్ణావకాశం.. ఈ అర్హతలుంటే రూ.15వేలు.. ఇలా అప్లై చేసుకోండి..


  అధికారిగా తనదైన ముద్ర...

  ఇక గతంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా, అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన గంధం చంద్రుడు ప్రజాసమస్యలు పరిష్కరించడంలో తన మార్క్ చూపించారు. దళిత వాడల పేర్లను మార్చడం, బస్సు సౌకర్యం లేని విద్యార్థినులకు బస్సు ఏర్పాటు చేయించడమే కాకుండా వారితో కలిసి ప్రయాణించడం, ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎండలో పనులు చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజాదరణ పొందారు. తాజాగా ఆయన కుమారుడు భువన్ చిన్నవయసులోనే ప్రపంచ రికార్డ్ సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Sports

  ఉత్తమ కథలు