ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్... మళ్లీ మంగళగిరి నుంచే లోకేష్ పోటీ...

AP Politics : 2024లో మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు. తద్వారా... వైసీపీ ఐదేళ్లు పాలిస్తుందని ఆయన పరోక్షంగా ఆ పార్టీని సమర్థించినట్లైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 5:38 AM IST
ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్... మళ్లీ మంగళగిరి నుంచే లోకేష్ పోటీ...
నారా లోకేష్, చంద్రబాబు
Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 5:38 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి. మంగళగిరి నుంచీ అసెంబ్లీకి పోటీ చేసిన లోకేష్ గెలుస్తారో, లేదో చంద్రబాబుకే గ్యారెంటీ లేని పరిస్థితి. అందుకే లోకేష్‌ని MLC పదవికి రాజీనామా చెయ్యనివ్వకుండా, ఎన్నికల బరిలోకి దింపారు. లోకేష్ ఓడిపోయారు. అయినప్పటికీ కొడుకు విషయంలో చంద్రబాబుకి చిన్న ఊరటే లభించింది. తిరిగి లోకేష్ MLCగా కొనసాగుతున్నారు. కానీ ఇది తాత్కాలిక ఆనందమే. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి వారసుడిగా పార్టీ పగ్గాలు అందుకొని, కొంతవరకూ సమర్థత నిరూపించుకున్నారు కేటీఆర్. అఫ్‌కోర్స్ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతిన్నా, కేటీఆర్ సమర్థతపై మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తల్లో అంతగా నెగెటివి ఫీలింగ్ లేదు. అదే నారా లోకేష్ విషయానికి వస్తే మాత్రం, చంద్రబాబు తర్వాత ఆ పార్టీని లోకేష్ నడిపించగలరన్న గ్యారెంటీ ఏమాత్రం లేదు. తన అభ్యర్థిత్వాన్నే గెలిపించుకోలేకపోయిన లోకేష్, ఇక పార్టీని ఏం నడిపిస్తారన్నది టీడీపీకి ఆన్సర్‌ లేని ప్రశ్న.

ఓటమి నైరాశ్యంలో కుంగిపోకుండా లోకేష్ మళ్లీ భవిష్యత్ వైపు పాజిటివ్‌గా చూస్తున్నారు. 2024లో తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని అంటున్నారు. మంగళగిరి కార్యకర్తలతో ఉండవల్లిలో కాసేపు మాట్లాడిన ఆయన... త్వరలోనే తాను మంగళగిరిలో పర్యటిస్తానన్నారు. ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దనీ, ఫలితాలపై విశ్లేషించుకొని, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుందామని అన్నారు.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు లోకేష్. రామకృష్ణారెడ్డికి స్థానికంగా మంచి పట్టుంది. ఆయన చేసిన కార్యక్రమాలు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల తిరిగి ఆయన గెలిచారు.

నారా లోకేష్ లాంటి వాళ్లు స్మృతి ఇరానీ లాంటి నేతలను ఆదర్శంగా తీసుకోవచ్చు. 2014లో అమేథీ నుంచీ పోటీ చేసిన ఆమె... కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేతిలో 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఘోర ఓటమి చూశారు. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి... అదే అమేథీలో మళ్లీ పోటీ చేసి, అదే రాహుల్‌ కంచుకోటలో భారీ విజయం సాధించి, కాంగ్రెస్ యువనేతను సాగనంపారు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. ఈ ఐదేళ్లూ ఆమె అదే నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నారు. వీధులన్నీ తిరిగారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. ఓవైపు కేంద్ర మంత్రిగా పనిచేస్తూనే మరోవైపు అమేథీ కోసం కృషి చేశారు. ఫలితం ఓటర్లు ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు. చాణక్యుడు చెప్పినట్లు, నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండేవారినే ప్రజలు కోరుకుంటారు. ఈ విషయం లోకే‌ష్ బోధపడేదెప్పుడో.

First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...