హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

I Love My India: ఉప్పుతో గ్లోబుపై భారత మాత చిత్రం.. ఉప్పొంగిన దేశ భక్తి

I Love My India: ఉప్పుతో గ్లోబుపై భారత మాత చిత్రం.. ఉప్పొంగిన దేశ భక్తి

ఉప్పుతో భారత మాత చిత్రపటం

ఉప్పుతో భారత మాత చిత్రపటం

Independence Day 2022: మేరా భారత్ మహాన్ అంటూ యావత్ భారత దేశం పులకించింది. దేశంలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకమే రెప రెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ కళకారుడు వేసిన చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఉప్పుతో గీసిన బొమ్మకు రంగులు అద్ది అద్భుతమే చేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

I Love My India: భారతదేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minster Modi) జాతీయ జండాను ఆవిష్కరించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మువ్వన్నెలు రెప రెపలు మిరమిట్లు గొలుపుతున్నాయి. తెలంగాణ (Telangana) లో సీఎం కేసీఆర్ (CM KCR).. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సీఎం జగన్ (CM Jagan) పతాకావిష్కరణ చేశారు. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెప రెపలాడింది.  ఐ లవ్ మై ఇండియా అంటూ నినదించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పొంగిపొర్లింది.  స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను గుర్తుకు చేసుకుంటూ.. సలామ్ చేశాం.  భారత దేశ గొప్పతనం ప్రపంచ నలుమూలలా తెలిసేలా సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నాం. పూర్ణ స్వరాజ్యం కల నెరవేరి 75 ఏళ్లు కావొస్తుంది. దీనికి గుర్తింపుగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకున్నాం. హర్ ఘర్ మే తిరంగా వెలిగిపోయింది. ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కళాకారులు అయితే ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రతిభను చూపెడుతూ.. భారత మాతకు జై అన్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ కళాకారుడు చేసిన ప్రయత్నం అందరి మన్ననలు అందుకునే లా చేస్తోంది. కేవలం ఉప్పుతో గ్లోబ్ పై భారత మాత బొమ్మ గీసి.. రంగులద్దాడు.. ఈ చిత్ర చూసినవారంతా ఆ కళాకారుడి ప్రతిభకు సలామ్ అంటున్నారు.

ఇలాంటి బొమ్మలు గీయడం అతడికి ఇదే తొలిసారి కాదు.. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. చిత్తూరు జిల్లాలోని కుప్పానిక ిచెందిన ఈ కళాకారుడు.. పూరి  ఆర్ట్స్ పేరుతో.. సమాజాన్ని చైతన్య పరిచేలా ఆయన పెయింట్స్ ఉంటున్నాయి.

ఇటీవల.. ఉప్పుతోనే తిరుమల వెంకటేశ్వరుడి బొమ్మ గీసి.. దానికి రంగులు అద్ది.. గోవిందుడి రూపాన్ని ఆవిష్కరించారు.. అతడు గీసిని శ్రీనివాసుడి ముఖ చిత్రం అద్భుతంగా ఉంది. పూరి ఆర్ట్స్ పేరుతో యువకుడు పలు చిత్రాలు రూపొందిస్తూ.. పలువురి మన్ననలు పొందుతున్నాడు.

ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన పీవీ సింధు బొమ్మను సైతం అట్టముక్కలతో అద్భుతంగా రూపొందించాడు. భారత దేశానికి సంబంధించి ఏ ఘనత వెలుగులోకి వచ్చినా... వెంటనే తన మైండ్ కు పదును పెట్టి.. అద్భుతాలు చేస్తున్నాడు మన పెయింటర్.. గతంలోనూ పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chitoor, Independence Day 2022, Viral Videos

ఉత్తమ కథలు