Home /News /andhra-pradesh /

I LOVE AMARAVATI BOARD REMOVED FROM DELHI AP BHAVAN AHEAD OF THREE CAPITALS BA

ఏపీ భవన్‌లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డు తొలగింపు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్న ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును సిబ్బంది తొలగించారు.

    దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్న ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును సిబ్బంది తొలగించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూడు రాజధానులు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏపీ భవన్‌లో బోర్డును తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోర్డు తొలగింపు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? అనే చర్చ జోరుగా మొదలైంది. అయితే, కోతులు ఆ బోర్డును పాడు చేస్తున్నాయన్న కారణంగానే తొలగించినట్టు ఏపీ భవన్ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ప్రస్తుతం తొలగించిన బోర్డును అంబేద్కర్ ఆడిటోరియం వెనుక వైపు పెట్టారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Amaravati, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు