• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • I DONT NEED YOUR CERTIFICATE NITIN GADKARI COUNTERS FOR RAHUL GANDHIS TWEETS NK

నీ తొక్కలో సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు... రాహుల్‌కి గడ్కరీ కౌంటర్

నీ తొక్కలో సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు... రాహుల్‌కి గడ్కరీ కౌంటర్

గడ్కరీ, రాహుల్ (Images : Twitter)

Gadkari Vs Rahul : గడ్కరీని మెచ్చుకుంటూ రాహుల్ ట్వీట్లు చేశారో లేదో... వెంటనే అటు నుంచీ రిప్లై వచ్చింది. అది పాజిటివ్‌గా మాత్రం కాదు. పూర్తి నెగెటివ్‌గా. అసలు గడ్కరీని రాహుల్ ఎందుకు మెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్థాయిని తగ్గించే వ్యూహమా.

  • Share this:
లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా రాహుల్ చేసిన ట్వీట్‌కి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. తనలో ధైర్యం గురించి... కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నుంచి తనకు సర్టిఫికెట్‌ అవసరం లేదని గడ్కరీ అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే... దాని వల్ల ప్రభుత్వ బలం పెరుగుతుందే తప్ప తగ్గదన్నట్లు ట్వీట్ చేశారు నితిన్ గడ్కరీ. తద్వారా తనను మెచ్చుకున్నా తన నుంచీ రాహుల్‌ పట్ల సానుకూల స్పందన రాదన్న సంకేతాలిచ్చారు గడ్కరీ. ఐతే... రాహుల్ ప్రశంసలు, గడ్కరీ కౌంటర్లపై అప్పుడే ఢిల్లీ వర్గాల్లో చర్చ మొదలైంది. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే... వాటి కంటే ఇలాంటి అంశాలపైనే నేతల ఫోకస్ ఉండటం దురదృష్టకరం.



రాహుల్ ఏమన్నారు : గడ్కరీ జీ బీజేపీలో ధైర్యం ఉన్న నేత మీరొక్కరే. దయచేసి 1. రాఫెల్‌ స్కాం, 2. రైతుల సమస్యలు, 3.నిర్వీర్యమవుతున్న వ్యవస్థలు, నిరుద్యోగం పై కూడా మాట్లాడండి అని రాహుల్‌ ట్వీట్ చేశారు. రాహుల్ సడెన్‌గా ఇలా స్పందించడం ఆశ్చర్యకరమే అయినా... గడ్కరీ మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.



దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న గడ్కరీ... కాంగ్రెస్‌ విధానాలతో తలెత్తిన రైతుల సమస్యల్ని నిజాయతీ గల మోదీజీ విధానాలు పరిష్కరిస్తున్నాయన్నారు. మోదీ ప్రధాని కావడాన్ని భరించలేకపోతున్నారు కాబట్టే దేశంలో అసహనం ఉందనీ, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని కలలు కంటున్నారు అని రాహుల్‌పై సెటైర్లు వేశారు గడ్కరీ.



రాహుల్ ఏ ఉద్దేశంతో గడ్కరీని మెచ్చుకున్నారోగానీ... ఆశించిన ఫలితం దక్కలేదని అర్థమవుతోంది. ప్రధానిగా మోదీ స్థాయిని తగ్గించేందుకే... గడ్కరీ స్థాయిని పెంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

Photos: ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ హాట్ ఫోటోస్..
First published:

అగ్ర కథనాలు