తాను మాటలు అనను, పడనని కానీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలని, మాటలు అనాలి, మాటలు పడాలి ఇది నాకు అవసరమా అంటూ చిరు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదని..మాటలు అంటాడు. పడతాడు అనుకున్నది సాధిస్తాడని మెగాస్టార్ (Megastar Chiranjeevi) వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కు మీరంతా ఉన్నారని ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్ ను చూస్తామని చిరంజీవి (Megastar Chiranjeevi) ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు వైఎన్ మూర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరైన చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
కాలేజీలో వేసిన నాటకంతోనే సినిమాల్లోకి..
కాగా కాలేజీలో వేసిన నాటకంతోనే సినిమాల్లోకి వచ్చానని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలిపారు. తనకు కష్టాన్ని, పనితనాన్ని నేర్పించింది ఎన్.సిసినేనని చిరు అన్నారు. అప్పటి నుంచి అనుకున్న దాని అంతు చూడడం నేర్చుకున్నానని తెలిపారు. కానీ ఒక్క రాజకీయాల్లో మాత్రం అలా చేయలేకపోయానని తెలిపారు.
ఇక కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ప్రెస్ మీట్ లో చిరు సెన్సషనల్ కామెంట్స్ చేశారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలి. పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారు. మంచి నిబద్దత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు త్వరలో తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తానేమో అంటూ కామెంట్స్ చేశారు. నేను రాజకీయాల నుండి దూరంగా రావడం పవన్ కు కలిసొస్తుందని చెప్పుకొచ్చారు. పవన్ అంకితభావం కలిగిన నాయకుడు అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఆ అవకాశం ప్రజలు పవన్ కు ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు.
ఓ విధంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్ మూవీనే సైలెంట్ గా ఉన్న చిరు (Megastar Chiranjeevi)ను మళ్లీ రాజకీయాల్లోకి మళ్లిస్తుందా అని అనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆమధ్య రిలీజ్ అయిన డైలాగ్ నేను రాజకీయానికి దూరంగా వున్నాను. నానుండి రాజకీయం దూరం కాలేదు అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Hyderabad, Megastar Chiranjeevi, Powe star pawan kalyan, Telangana