హైదరాబాద్-విజయవాడ టికెట్ రూ.20 వేలా? పండగ వేళ విమానసంస్థల దోపిడీ

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే డబ్బులతో...థాయ్‌లాండ్‌కు విమానంలో వెళ్లిరావచ్చు. హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌ (రౌండ్ ట్రిప్)కు శుక్రవారం విమాన టిక్కెట్‌ ధర రూ.18,900గా (శుక్రవారం సాయంత్రం నాటి వివరాల మేరకు) ఉంది

news18-telugu
Updated: January 11, 2019, 7:41 PM IST
హైదరాబాద్-విజయవాడ టికెట్ రూ.20 వేలా? పండగ వేళ విమానసంస్థల దోపిడీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 11, 2019, 7:41 PM IST
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. పండగవేళ నగర ప్రజలంతా పల్లెబాట పడుతున్నారు. ఉరుకుపరుగుల నగర జీవనం నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. సంక్రాంతి ప్రయాణికులతో హైదరాబాద్‌లోని బస్సు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఐతే ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు దోపిడీ మొదలు పెట్టాయి. విమాన టికెట్ల ధరలు 10శాతం పెరగ్గా...బస్సు టికెట్ల రేట్లు రెట్టింపయ్యాయి. దాంతో సాధారణ ప్రయాణికుల జేబులు బస్టాండ్లలోనే సగం మేర ఖాళీ అవుతున్నాయి.

మొన్నటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం విమాన టికెట్ ధరలు రూ.1500 -3000 వరకు ఉండేవి. కానీ పండగ రోజుల్లో డిమాండ్ పెరగడంతో అమాంత రేట్లు పెంచాయి విమానయాన సంస్థలు. శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన టికెట్ ధరలు గరిష్టంగా రూ.20వేల (శుక్రవారం సాయంత్రం నాటి వివరాల మేరకు) వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రికి వెళ్లే విమాన టికెట్ల రేట్లు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి. ఐతే అవే డబ్బులు పెడితే ఎంచక్కా విదేశాలకు టూర్ వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే డబ్బులతో...థాయ్‌లాండ్‌కు విమానంలో వెళ్లిరావచ్చు. హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌ (రౌండ్ ట్రిప్)కు శుక్రవారం విమాన టిక్కెట్‌ ధర రూ.18,900గా (శుక్రవారం సాయంత్రం నాటి వివరాల మేరకు) ఉంది. దీన్ని బట్టి అర్ధంచేసుకోవచ్చు తెలుగురాష్ట్రాల్లో విమానయాన సంస్థలు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయో..!

అటు ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి అదనపు చార్జీలు వస్తున్నాయి. సాధారణం కంటే నాలుగైదు రెట్లు టికెట్ల ధరలు పెంచాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ఏసీ బస్ చార్జీ గరిష్టంగా రూ.1300గా ఉంది. ఇక ఏసీ బస్సులో అయితే రూ.3వేలు చెల్లించాలి. ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు నాన్‌ఏసీ బస్ చార్జీ గరిష్టంగా రూ.2500గా ఉంది. అదే ఏసీ బస్సులో విశాఖపట్నం వెళ్తే రూ.4వేలు కట్టకతప్పదు.


కాగా, సంక్రాంతి పండగ నేపథ్యంలో మరోం వారం వరకు రైళ్లలో రిజర్వేషన్ సీట్లన్నీ ఇప్పటికే బుకింగ్ అయిపోయాయి. దాంతో రిజర్వేషన్ సీట్స్ దొరకని ప్రయాణికులు కిక్కిరిసిన జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ నరకం చూస్తున్నారు. కనీసం బస్సుల్లోనైనా వెళ్దామనుకుంటే..అక్కడ డబుల్ రేట్లతో నిలువునా దోచేస్తున్నారు. దాంతో అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ ఆపరేట్సర్, విమానయాన సంస్థలను కట్టడి చేయాలని జనం కోరుతున్నారు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...