ఏపీ సీఎం జగన్‌కు బిగ్ షాక్... పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు

Jagan Cases : అసలే ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్న సీఎం జగన్... తాను కోర్టుకు వస్తే... అనవసరపు ఖర్చులు అవుతాయన్నారు. జగన్ నాటకాలాడుతున్నారంటున్న సీబీఐ... కోర్టుకు రాకపోతే... సాక్ష్యల్ని ప్రభావితం చేస్తారంది. చివరకు సీబీఐ వాదనే నెగ్గింది.

news18-telugu
Updated: November 1, 2019, 11:45 AM IST
ఏపీ సీఎం జగన్‌కు బిగ్ షాక్... పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు
వైఎస్ జగన్
  • Share this:
AP News : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ప్రతీ శుక్రవారం తమ ముందు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది సీబీఐ కోర్టు. ఈ విషయంలో సీబీఐ తరపు లాయర్ వాదనతో సీబీఐ కోర్టు ఏకీభవించింది. ఐతే సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ... జగన్ తరపు లాయర్ హైకోర్టుకు వెళ్లబోతున్నట్లు తెలిసింది. తాను ఏపీ సీఎం అయినందువల్ల చాలా పనులున్నాయనీ, పైగా తాను హాజరైతే... అనవసరపు ఖర్చులు అవుతాయనీ కోర్టుకు తెలిపిన జగన్... ఈ వ్యక్తిగత హాజరు నుంచీ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ తనకు బదులుగా తన లాయర్ హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. సీఎం హోదాలో ఉన్న తాను... ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వస్తే... తనకు సెక్యూరిటీ, ప్రోటోకాల్ వంటి అంశాలకు ఒక్క రోజుకు రూ.60 లక్షలు అవుతాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి... ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని అన్నారు.

జగన్‌పై తీవ్ర ఆర్థిక నేరాల అభియోగాలు ఉన్నాయనీ... ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని అరెస్టు చేశామనీ, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని.. అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచీ మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తరపు లాయర్ వాదించారు.

ఇదివరకు ఇదే అంశంపై రెండుసార్లు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు. రెండుసార్లూ కోర్టు పిటిషన్లను కొట్టివేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా జగన్‌కు వ్యతిరేక తీర్పే వచ్చింది. అలా కుదరదని హైకోర్టు కూడా చెప్పింది. మళ్లీ జగన్ ఇదే అంశంపై సీబీఐ కోర్టుకు వెళ్లడాన్ని సీబీఐ తరపు లాయర్లు తప్పుపట్టారు. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే... సుప్రీంకోర్టుకు వెళ్లాలి గానీ... ఇలా మళ్లీ సీబీఐ కోర్టుకు ఎందుకు వెళ్లారన్నది సీబీఐ తరపు లాయర్ వేస్తున్న ప్రశ్న. ఇలా ఆసక్తికర మలుపులు ఉన్న ఈ కేసులో... సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌కు ఇబ్బందికరమే అనుకోవచ్చు.

 

Pics : క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న హిప్పీ బ్యూటీ దిగంగనఇవి కూడా చదవండి :అనసూయ జబర్దస్త్ సందేశం... యువతకు ప్రత్యేకం

కర్తార్‌పూర్ యాత్రికులకు పాకిస్థాన్ ఆహ్వానం... ఇమ్రాన్‌ఖాన్ ఏమన్నారంటే...

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏర్పాటయ్యేదెప్పుడు?

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలపై సస్పెన్స్... నేడు కరీంనగర్ బంద్?

పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న టీడీపీ... వైసీపీ టార్గెట్‌గా ప్లాన్ C అమలు
First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading