క్యూనెట్ కేసు: పోలీసుల నోటీసులకు స్పందించని అల్లు శిరీష్, పూజా హెగ్డే

నిందితుల విచారణలో పలువురు ప్రముఖల పేర్లు బయటకు రావడంతో వారందరికీ నోటీసులు జారీచేశారు పోలీసులు.

news18-telugu
Updated: August 27, 2019, 5:48 PM IST
క్యూనెట్ కేసు: పోలీసుల నోటీసులకు స్పందించని అల్లు శిరీష్, పూజా హెగ్డే
అల్లు అర్జున్, పూజా హెగ్డే
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసులో సినీ ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సినీ ప్రముఖులు షారూఖ్ ఖాన్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, వివేక్ ఓబెరాయ్, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌కు ఇప్పటికే నోటీసులు పంపామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. వీరిలో అనిల్ కపూర్, బొమన్, షారూఖ్ మాత్రమే తమ న్యాయవాదుల ద్వారా స్పందించారని..మిగిలిన వారు స్పందించలేదని చెప్పారు. క్యూనెట్ వ్యవహారంలో మొత్తం 38 కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 70 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు సజ్జనార్. క్యూనెట్‌ కేసులో పురోగతిని మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. క్యూనెట్‌ సంస్థ రెండు అవతారాలతో ప్రజలను మోసగించిందని, ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు మేర మోసం జరిగిందని సీపీ వివరించారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే లక్ష్యంగా జరిగిన క్యూనెట్ స్కాంలో బాధితులు లక్షల్లో ఉన్నారు. సజ్జనార్‌ చెప్పారు. నిరుద్యోగులను కూడా ఈ సంస్థ మోసం చేసింది. దేశవ్యాప్తంగా దిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో కేసులు నమోదు చేశాం. 12 మందికి ఎల్వోసీ జారీ చేశాం. కంపెనీతో సంబంధం లేకుండా నకిలీ డైరెక్టర్లు రూ.కోట్లు వాడుకున్నారు. ఎంతో మంది క్యూనెట్‌ బాధితులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రజలు ఎవరూ క్యూనెట్‌లో చేరవద్దు.
సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్


ఇటీవల హైదరాబాద్‌లో భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం బయటపడింది. చైన్ సిస్టమ్ ద్వారా కమిషన్లు, ప్రైజ్ మనీ వస్తాయని చెప్పి.. వేల సంఖ్యలో అమాయక ప్రజలను క్యూనెట్ సంస్థ నట్టేట ముంచింది. రూ.100 కోట్ల మేర డబ్బు వసూలు చేసి మోసం చేసింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు మల్టిలెవెల్ స్కామ్‌ను బట్టబయలు చేశారు. క్యూనెట్ స్కాంపై కంపెనీపై జనవరిలో హైదరాబాద్ పోలీసులు కేసునమోదు చేశారు. హైదరాబాద్‌తో పాటు ఏపీ, కర్నాటక, ఢిల్లీలోనూ ఈ సంస్థపై కేసులున్నాయి.

QI గ్రూప్ (హాంకాంగ్)కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'క్యూనెట్' పేరిట భారత్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతోంది. నిరుద్యోగ యువతకు కమిషన్లు ఆశచూపి..కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసింది. ఈ కేసులో అరెస్టైన పలువురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితుల విచారణలో పలువురు ప్రముఖల పేర్లు బయటకు రావడంతో వారందరికీ నోటీసులు జారీచేశారు పోలీసులు.


First published: August 27, 2019, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading